మొత్తం 199 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. నిజానికి రాష్ట్రంలో 200 స్థానాలు ఉండగా ఒక్క స్థానానికి మాత్రం పోలింగ్ జరగడం లేదు. కరణ్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి గుర్మిత్ సింగ్ కున్నూర్ మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. ఇక 199 స్థానాల్లో 1862 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 5,25,38,105గా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 36, 101 పోలింగ్ స్టేషన్లలో..
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. శనివారం (శనివారం) అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
మొత్తం 199 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. నిజానికి రాష్ట్రంలో 200 స్థానాలు ఉండగా ఒక్క స్థానానికి మాత్రం పోలింగ్ జరగడం లేదు. కరణ్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి గుర్మిత్ సింగ్ కున్నూర్ మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. ఇక 199 స్థానాల్లో 1862 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 5,25,38,105గా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 36, 101 పోలింగ్ స్టేషన్లలో 51,507 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. 2, 74, 846 మంది ఎన్నికల సిబ్బంది, లక్ష 70 వేల మంది భద్రతబలగలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్- బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గత కొన్నిరోజులుగా హోరాహోరీగా విమర్శలు, ప్రతివిమర్శలతో రెండు ప్రధాన పార్టీలు హోరాహోరిగా తలపడ్డాయి. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో 199 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి హఠాన్మరణంతో పోలింగ్ ఆగిపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీగా బలగాలను మోహరించారు.
ఐదేళ్లకోసారి మరో పార్టీకి పగ్గాలు ఇవ్వడమనే సంప్రదాయం ఈసారి తమకు అనుకూలిస్తుందని కమలనాథులు కంకణం కట్టుకున్నారు. మహిళలపై రేప్ కేసుల్లో దేశంలోనే రాజస్థాన్ టాప్ అనే అంశాన్ని బీజేపీ ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మలచుకుంది. అయితే ఈ కేసుల్లో శిక్షలు విధించడంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే తామే నెంబర్‌వన్ అని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంది. ఇక ఈ సారి బీజేపీ హామీల వర్షం కురిపించింది. యాంటీ రోమియో ఫోర్స్ సిద్ధం చేస్తామన్నది బీజేపీ హామీ. పేదకుటుంబాల్లో పుట్టే ఆడపిల్లలకు సేవింగ్స్ బాండ్స్ ఇస్తామనీ, పేద కుటుంబాల మహిళలకు 450 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్లు ఇస్తామని బీజేపీ భరోసా ఇస్తోంది. అందుకే అధికార బంతి ఈసారి తమ చేతుల్లోకి వచ్చి తీరాలని కమలనాథులు చెబుతున్నారు.
ఇదే సమయంలో బీజేపీ లోటుపాట్లపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. బీజేపీ ఈసారి CM అభ్యర్థులను ప్రకటించలేదు. హిందీ బెల్ట్‌లో ఈ సంప్రదాయానికి ఫుల్స్టాప్ పెడుతున్నట్లు కూడా చెప్పింది. వసుంధరా రాజేకి ఝాల్రాపటన్ నుంచి టికెట్ ఇచ్చినా, ఆమె వర్గీయులకు మాత్రం మొండిచెయ్యి చూపించారు. అదేసమయంలో ఏడుగురు ఎంపీలను బీజేపీ బరిలోకి దించుతోంది. బీజేపీలో గ్రూపుల కొట్లాటను కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా వాడుకుంటోంది. సీఎం అభ్యర్థి ఎవరో ఇప్పటికీ ప్రధాని మోదీ వెతుకుతున్నారంటూ ప్రియాంకా ఎద్దేవా చేశారు. ఇక మహిళల భద్రతపై భరోసా కల్పించేందుకు, కాంగ్రెస్, ప్రతి ఇంటి ఆడపడుచుకు పదివేలు ఇస్తామని ప్రకటించింది. 400 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటోంది.కాషాయంపై ఎదురుదాడికి దిగుతూనే, ట్రెండ్ రివర్స్ చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది.
ఇదిలా ఉంటే రాజస్థాన్‌లో ఈసారి 22 లక్షల మంది తొలిసారి ఓటర్లు తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకోబోతున్నారు. మహిళల భద్రత, ఉద్యోగాలతోపాటు, ఇతర హామీల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది రాజస్థాన్‌లో హాట్ టాపిక్ అయింది.