రాజస్తాన్‌లోనూ పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది బీజేపీ. మొత్తం 199 అసెంబ్లీ స్థానాలకు గానూ ప్రస్తుతం 107 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ 75 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అయింది. ఇతరులు 17 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 101 రావాలి. అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైనన్ని స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది కమలం పార్టీ.
రాజస్తాన్‌లోనూ పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది బీజేపీ. మొత్తం 199 అసెంబ్లీ స్థానాలకు గానూ ప్రస్తుతం 108 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ 75 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అయింది. ఇతరులు 16 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 101 రావాలి. అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైనన్ని స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది కమలం పార్టీ. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పిన విషయం మనకు తెలిసిందే. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 107, బీజేపీ 70 స్థానాలు గెలుచుకున్నాయి. ఇతరులు కూడా తీవ్ర ప్రభావం చూపారు. అయితే ఈసారి బీజేపీవైపు రాజస్తాన్ ఓటర్లు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
రాజస్థాన్ బీజేపీ చీఫ్ ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ బీజేపీ భారీ మొజార్టీతో గెలుస్తుందని, మరోసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కార్యకర్త హనుమాన్ వేషం ధరించి ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ వద్ద జై హనుమాన్ నినాదాలు చేశారు. బీజేపీ గెలవాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జైపూర్ గోవింద్ దేవ్‌జీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం రాజస్తాన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అందించిన సంక్షేమాలే తమను తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ తరఫున నరేంద్రమోదీ స్వయంగా రోడ్ షోలతో పాటూ పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మోదీ హవా రాజస్తాన్‌లో తప్పకుండా ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.