బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని.. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని తెలిపింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని తెలిపింది. వీటి కారణంగా వచ్చే మూడురోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. హఠాత్తుగా మేఘాలు ఏర్పడి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాతావరణ మార్పుకు కారణం శుక్రవారం ఈశాన్య, తూర్పు , మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంమని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో మూడు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని.. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని తెలిపింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని తెలిపింది.
వీటి కారణంగా వచ్చే మూడురోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా శనివారం అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడ్డాయి.
సముద్రం మేఘాలతో కప్పబడి ఉందని.. దీంతో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈసారి కురుస్తున్న వర్షాలతో ఉరుములు, మెరుపులు కూడా వస్తాయి. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వర్షాలు కురిసే సమయంలో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.