- యాత్రలో పాల్గొంటున్న వందలాదిమంది ప్రజలు
- కిక్కిరిసిపోయిన పాదయాత్ర రూట్
- ఆదివాసీలతో కలసి గుస్సాడి నృత్యం చేసిన రాహుల్
- రాహుల్ వెంట యాత్రలో పాల్గొన్న సిఎల్పీ నేత భట్టి
- యాత్రలో పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నా రాహుల్
అక్టోబర్ 29 (ఆంధ్రపత్రిక): మహబూబ్‌నగగర్,అక్టోబర్29(ఆంధ్రపత్రిక):రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర తెలంగాణలో నాలుగో రోజు ప్రారంభమైంది. మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ జనసందోహం నడుమ.. రాహుల్ శనివారం ఉదయం ధర్మాపూర్ వద్ద భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ వెంట వస్తోన్న కార్యకర్తలు, అభిమానుల సందడితో పాదయాత్ర రూట్ కిక్కిరిసిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లాలో రాహుల్‌గాంధీ భారత్ జోడోయాత్రకు మంచి ఆదరణ లభిస్తోంది. శనివారం మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాహుల్ వెంట సిఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, పలువురు నేతలు నడుస్తున్నారు.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నాలుగో రోజు.. మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వరకు సాగనుంది. ఈ సందర్భంగా రాహుల్ పలువురిని కలుస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఈ యాత్రలో కేంద్ర రాష్ట్ర ప్రభూత్వాల వైఫల్యాలపై రాహుల్ గళమెత్తుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని.. పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉల్లాసంగా.. ఉత్సాహంగా కొనసాగుతోంది. పాదయాత్రకు వస్తున్న వందలాది మందితో కలిసి రాహుల్.. తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఆదివాసీలతో కలిసి గుస్సాడీ నృత్యం చేశారు. రాహుల్ తమతో కలిసి నృత్యం చేయడంతో ఆదివాసీ మహిళలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా రాహుల్‌తో కలిసి స్టెప్పేలు వేశారు. కొమ్ము కోయ కళాకారులతో కలిసి రాహుల్ ఉత్సాహంగా నృత్యం చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదివాసీల కళారూపం గురించి వివరించారు. భారత్ జోడో యాత్రలో కొమ్ముకోయ కళారూపం ఆకట్టుకుంటోంది. ఈ సమయంలో రాహుల్ వారిని చూసి.. కోయ కళాకారులతో కలిసి నృత్యం చేశారు. భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క.. ఖమ్మం జిల్లాకు చెందిన ఆదివాసీలతో కొమ్ము కోయ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. దీనిని రాహుల్ మహబూబ్ నగర్ పాదయాత్రలో ఆసక్తిగా తిలకించినట్లు భట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొమ్ము కోయ ప్రదర్శనలో కళాకారులతో కలసి రాహుల్ లయబద్ధంగా అడుగులు వేస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. రాహుల్ గాంధీ.. విద్యా సంబంధిత సమస్యలపై వివిధ సంస్థలు, ప్రముఖులతో భేటీ కానున్నారు. పాలమూరు విద్యావంతుల వేదిక తరపున ప్రో. హరగోపాల్, రఘవాచారి, ఎం.వి ఫౌండేషన్ తరపున వెంకట్ రెడ్డి లతో పాటు స్వచ్చంద సంఘాల నాయకులు నీలిమ, విద్యార్థి నాయకులు తదితరులు రాహుల్ గాంధీతో ఎనుగొండ క్యాంప్ లో భేటీ కానున్నారు. సమగ్ర విద్యా విధానం, ఫీజు రీయంబర్స్మెంట్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సమస్యలు, విద్యార్థులకు కలుషిత ఆహారం, సౌకర్యాల లేమి, యూనివర్సిటీలలో సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇకపోతే ఈ యాత్రంలో సినీ నటి పూనమ్ కౌర్ కూడా పాల్గొని.. రాహుల్ తో ముచ్చటించారు. కాగా.. భారత్ జోడో యాత్రలో రాహుల్ వెంట వస్తోన్న కార్యకర్తలు, అభిమానుల సందడితో పాదయాత్ర రూట్ కిక్కిరిసి పోయింది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఈ యాత్రలో రాహుల్ కేంద్ర, రాష్ట్ర ప్రభూత్వాల వైఫల్యాలపై గళమెత్తుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని.. పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నారు.