హైదరాబాద్,నవంబర్ 2 (ఆంధ్రపత్రిక): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ నగరంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ నుంచి ప్రారంభమైన యాత్ర న్యూబోయిన్‌పల్లి, బాలానగర్ మెయిన్‌రోడ్డు, సుమిత్రా నగర్ ఐడీపీఎల్ ఉద్యోగుల కాలనీ మీదుగా మదీనాగూడ చేరుకుంది.మధ్యాహ్న భోజన విరామం అనంతరం పాదయాత్ర మియాపూర్‌లోని ఇందిరానగర్ కాలనీ, రామచంద్రాపురం, పటాన్చెరు శాంతినగర్ మీదుగా ముత్తంగి వరకు సాగనుంది.యాత్ర పొడవునా కాంగ్రెస్ ముఖ్యనేతలు సహా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాహుల్‌తో కలిసి నడిచారు. పాదయాత్ర మార్గంమధ్యలో పలుచోట్ల ప్రజల కష్టాలను రాహుల్ తెలుసుకున్నారు. ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లకు ఇరువైపులా వేచిచూశారు. పాదయాత్రలో బాలీవుడ్‌కి చెందిన సినీనటి పూజా భట్ రాహుల్‌ను కలిశారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!