పార్లమెంట్‌ను ముందే ముగించారు
పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శలు
న్యూఢల్లీి,డిసెంబర్23 (ఆంధ్రపత్రిక): ఇక ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజలకు వివరిస్తామని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఢల్లీిలో మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం పై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా రాష్టాల్ల్రో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఖర్గే దిశానిర్దేశం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను అడ్డుకోవడానికే కరోనా రూల్స్ పెట్టారని కేంద్రంపై మండిపడ్డారు. పార్లమెంట్ లో కరోనా రూల్స్ ఎందుకు అమలు చేయలేదన్నారు. ఢల్లీిలో రాహుల్ జోడో యాత్రను అడ్డుకునేందుకు ప్రధాని మోడీ కుట్ర పన్నారని రేవంత్ ఆరోపించారు. రాహుల్ యాత్రను చూసి మోడీ భయపడుతున్నారని విమర్శించారు. రాహుల్ పార్లమెంట్?కు వచ్చి.. జోడో యాత్రలో చూసిన ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తారని తెలిసే.. షెడ్యూల్ కంటే ముందుగానే సమావేశాలను ముగించారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా రవాణాలో ఎందుకు కోవిడ్ రూల్స్ తీసుకురావట్లేదని నిలదీశారు. భారత్ జోడో యాత్ర ఢల్లీికి చేరుకుంటున్న సందర్భంలో.. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎంపీలంతా ఆయనతో పాటు కలిసి నడుస్తామని రేవంత్ రెడ్డి వెల్లడిరచారు. జనవరిలో యాత్ర ఫర్ ఛేంజ్ కార్యక్రమాన్ని చేపట్టబోతు న్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జనవరి 26 నుంచి జూన్ వరకు చేపడతామన్నారు. హాత్ సే హాత్ అభియాన్ కార్యక్రమాలు, రాహుల్ గాంధీ జోడో యాత్ర పై చర్చించామన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ªుల్లా బ్లాక్ స్థాయి, గ్రామస్థాయి నుంచి ప్రజా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నామని రేవంత్ స్పష్టం చేశారు. ఇక జనవరి 3, 4 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. దేశ అభివృద్ధి సమైక్యత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.