బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పర్యటన తర్వాత ఖమ్మం జిల్లా రాజకీయాలు భగ్గుమన్నాయి. తుమ్మల నాగేశ్వరరావుపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యల అనంతరం.. తుమ్మల కేసీఆర్ ను ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు తానే మంత్రి పదవి ఇప్పించినట్టు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరరావు చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు ఖమ్మం బీఆర్ఎస్ నేతలు..
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పర్యటన తర్వాత ఖమ్మం జిల్లా రాజకీయాలు భగ్గుమన్నాయి. తుమ్మల నాగేశ్వరరావుపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యల అనంతరం.. తుమ్మల కేసీఆర్ ను ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు తానే మంత్రి పదవి ఇప్పించినట్టు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరరావు చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు ఖమ్మం బీఆర్ఎస్ నేతలు.. తుమ్మలపై కేసీఆర్ వ్యాఖ్యల్లో తప్పేముంది..? అంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తుమ్మల కంటే ఊసరవెల్లి నయం అని.. మూడు ఎన్నికల్లో మూడు గుర్తులపై పోటీ చేశారంటూ మండిపడ్డారు. ప్రతిసారి తుమ్మల ఓడిపోయారని.. వందల ఎకరాలు తుమ్మల కబ్జా చేశారంటూ ఆరోపించారు.కేసీఆర్‌ను విమర్శించే స్థాయి తుమ్మలకు లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ వాదులను జైల్లో పెట్టించిన చరిత్ర తుమ్మలకు ఉందంటూ మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.
సొంతంగా పార్టీని స్థాపించి .. తుమ్మల లాంటి వ్యక్తులను మంత్రి చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు. కేసీఆర్‌కు తాను మంత్రి పదవి ఇప్పించినట్టు తుమ్మల చెప్పుకోవడం పెద్ద జోక్ అని అన్నారు.
తనపై తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించారు పాలేరు బీఆర్ఎస్ అభ్యర్ధి కందాల ఉపేందర్‌రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం తనకు ఒక్క కాంట్రాక్ట్ ఇచ్చినట్టు రుజులు చేసినా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
కాగా.. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల, పువ్వాడ మధ్య పోటీ నెలకొంది.