- కేంద్ర పెట్రోలియం శాఖ హర్దీప్ సింగ్ పురి
- ఇంధనాన్ని కొనవద్దని తమకు ఏ దేశం చెప్పలేదు
న్యూఢల్లీి,అక్టోబర్ 8 (ఆంధ్రపత్రిక): ఏ దేశం నుంచైనా ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేంద్ర పెట్రోలియం శాఖ హర్దీప్ సింగ్ పురి తెలిపారు. రష్యా నుంచి ఇంధనాన్ని కొనవద్దు అని ఏ దేశం కూడా తమకు చెప్పలేదని మంత్రి పేర్కొన్నారు. భారత్‌లో ఉన్న జనాభా దృష్ట్యా, ఇక్కడ ఉన్న వినియోగం దృష్ట్యా.. అవసరాల మేరకు ఇంధనకొనుగోళ్లు తప్పవన్నారు. ఈ నేపథ్యంలో ఎవరి నుంచైనా ఇంధనాన్ని కొంటామని ఆయన అన్నారు. మన విధానాల పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలని, ఇంధన భద్రత, ఇంధనం ఖరీదు చేసే స్థోమత విషయాలను ఆలోచిస్తే, అప్పుడు ఎక్కడి నుంచైనా ఇందనం కొంటామని మంత్రి పురి తెలిపారు.