కాణిపాకంలో పున్నమి గరుడ సేవ
కాణిపాకంలో గురువారం పున్నమి గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయానికి అనుబంధ వరదరాజస్వామి ఆలయంలో ఉదయం మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహించి స్వామిని భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

ఐరాల(కాణిపాకం), ఏప్రిల్ 6: కాణిపాకంలో గురువారం పున్నమి గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయానికి అనుబంధ వరదరాజస్వామి ఆలయంలో ఉదయం మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహించి స్వామిని భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణస్వామి చిత్రపటాన్ని ఉంచి భక్తుల చేత వ్రతాన్ని చేయించారు. రాత్రి శ్రీదేవి,భూదేవి సమేత వరదరాజస్వామి ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఉంచి కాణిపాక పురవీధులలో ఊరేగించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటేశు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండ్ శ్రీనివాస్, ఆలయ ఇన్స్పెక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.