భవిష్యత్ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం
హైదరాబాద్,డిసెంబర్ 20 (ఆంధ్రపత్రిక): ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ అయ్యారు. పలు కార్యక్రమాల కోసం మంగళవారం హైదరాబాద్ కు వచ్చిన భగవంత్ మాన్ రెండు రాష్టాల్ర పరిస్థితులు, దేశ రాజకీయాలపై ప్రగతిభవన్లో చర్చించినట్లు సమాచారం.టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత దేశ వ్యాప్తంగా దూకుడు పెంచాలని భావిస్తున్న కేసీఆర్ పంజాబ్ ముఖ్యమంత్రితో పలు విషయాలను చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఉన్న ఎంపీలు, జాతీయ స్థాయిలో సంబంధాలున్న వారి సూచనల మేరకు బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు సన్నాహాలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల కథనం. భారత రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ఢల్లీిలో ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి పలు రాష్టాల్రకు చెందిన ఆయా పార్టీల నాయకులు, రైతు సంఘాల నేతలు కేసీఆర్తో సమావేశమవుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. బీజేపీపై పోరాటం విషయంలో కేసీఆర్కు పలువురు నేతలు మద్దతు తెలుపుతున్నారు. పంజాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్సింగ్ సంధ్వాన్ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్జీత్ సింగ్ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్కు రానున్నారు.