మచిలీపట్నం సెప్టెంబర్ 1 ఆంధ్రపత్రిక.:
జిల్లాలో అటవీ భూములతో పాటు వన్య ప్రాణాలను సంరక్షించాలని, అడవుల ఆక్రమణదారులపై వారంలోగా క్రిమినల్ కేసులు బనాయించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు.
శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో జిల్లాస్థాయి అటవీ వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త జిల్లాలు ఏర్పడ్డాక జిల్లాలో అటవీ విస్తీర్ణం 28008.84 హెక్టార్లు ఉందన్నారు.
జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం 33 శాతం అటవీ విస్తీర్ణం కలిగి ఉండాల్సి వుండగా జిల్లాలో కేవలం 7.42 శాతం అటవీ భూమి ఉందన్నారు. ఆ మేరకు 33 శాతం అటవీ భూమిని వృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా ఆక్రమణదారులపై ఉక్కు పాదం మోపి ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా సరే విడిచి పెట్టవద్దని స్పష్టం చేశారు.ముఖ్యంగామెట్లపల్లి బీట్ పరిధిలోని సురవరం, పోతురాజు గట్టు, నూతుల గట్టు, మెట్లపల్లి, మాలగట్టు, కాట్రేనిపాడు, రిజర్వు అటవీ భూభాగంలోని 310.39 హెక్టార్ల లో ఆక్రమణలు జరిగినట్లు గుర్తించడం జరిగిందన్నారు. అలాగే కానూరు రిజర్వ్ ఫారెస్ట్ లో కూడా 635.77 హెక్టార్ల అటవీ భూమి చాలా వరకు ఆక్రమణకు గురైనట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఈ అటవీ భూభాగాన్ని ఆక్రమించిన వారిపై వారం రోజుల్లోగా క్రిమినల్ కేసులు బనాయించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటిని తిరిగి సంరక్షించుకొనుటకు అన్ని చర్యలు గట్టిగా చేపట్టాలన్నారు.
అటవీ వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఆలివ్ ఇడ్లీ సముద్ర తాబేల్లు షెడ్యూల్ ఒకటి జాతి కిందికి వస్తాయన్నారు. జాలర్ల మర బోట్ల ఫ్యాన్ చక్రం తాకడం వలన వాటి మరణాల శాతం సముద్ర తీరం వెంబడి ఎక్కువగా ఉందని, వాటి మరణాలను తగ్గించేందు కోసం మత్స్యశాఖ వారు మర బోట్లకు లైసెన్సులు, అనుమతులు ఇచ్చే ముందు తప్పనిసరిగా మారబోట్లకు ప్రత్యేకమైన పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని షరతుతో కూడిన అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇదివరకే ఇచ్చిన మరబోట్లకు తాబేల్లు చనిపోకుండా ప్రత్యేకమైన పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయమై మత్స్యకారులందరికి అవగాహన కలిగించాలని సూచించారు.
మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. పట్టణ పిల్లలు, పెద్దలు పట్టణంలోని కాలుష్యం నుండి బయటకు వచ్చి ఆహ్లాదకర వాతావరణంలో ఆడుకొనుటకు విశ్రాంతి తీసుకొనుటకు నగర వనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇందు కోసం
మంగినపూడి బీచ్ ప్రాంతంలో 20 ఎకరాలను గుర్తించి పర్యాటక ప్రదేశంగా నగరవనంగా తీర్చిదిద్దేందుకు రెవెన్యూ, అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాను మంచి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకోసం హంసలదీవి, మోపిదేవి, ఓడరేవు, హార్బర్, తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలు చారిత్రాత్మక ప్రదేశాలను, ఆహ్లాదకర ప్రదేశాలను కలుపుతూ ఒక పర్యాటక సర్క్యూట్‌ను ప్రణాళిక బద్ధంగా సిద్ధం చేయాలన్నారు. తద్వారా జిల్లాకు మంచి రాబడి వస్తుందన్నారు.
అటవీ శాఖ నూతన కార్యాలయం నిర్మించుట కోసం అవసరమైన స్థలాన్ని గుర్తించి కేటాయించాలని సూచించారు
బందర్ పోర్టు ఎక్స్‌టెన్షన్‌ను నాలుగు బ్లాగులుగా విభజించడం జరిగిందని అందులో రెండవ బ్లాక్ లో
డిఎఫ్ఓ రాజశేఖర్ మాట్లాడుతూ అటవీ శాఖ వద్ద ఉన్న గజట్ రికార్డుల ప్రకారం హార్బర్ వారికి 225 ఎకరాలు ఇచ్చి నట్లు ఉందని, అయితే రెవెన్యూశాఖ కలెక్టర్ గారి ద్వారా హార్బర్ వారికి 406 ఎకరాలు ఇచ్చినట్లు వారు చూపిస్తున్నారు. ఈ విషయమై రెవెన్యూ, సర్వే, అటవీ శాఖల ద్వారా ఉమ్మడి సర్వే చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఈ విషయమై సర్వే చేయుటకు కావలసినంత బడ్జెట్‌ను కేటాయించాలని ప్రతిపాదనలను ప్రధాన ముఖ్య అటవీ సంరక్షకులు, మంగళగిరి వారికి పంపాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీహరి రావు, డిఆర్ఓ ఎం.వెంకటేశ్వర్లు, డీఎఫ్ఓ కే రాజశేఖర్, ఆర్డిఓ ఐ కిషోర్, సర్వే భూ రికార్డుల ఏడి రంగారావు, మత్స్యశాఖ
ఏడి వెంకటేశ్వర్ రెడ్డి, ఎఫ్ఆర్ఓ లు సిహెచ్ సుజాత, షరీఫ్ తదితర అధికారులు పాల్గొన్నారు