గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మారిపోయిన ప్రియాంక చోప్రా అప్పుడప్పుడు ఇండియాకు వస్తూ ఉంటుంది. తాజాగా ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేసింది. అక్కడ రాజకీయాలు భరించలేకే హాలీవుడ్‌కు మారిపోయానని తెలిపింది.
అయితే హాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్, ప్రియాంక చోప్రాలు 2018న ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి సరోగసి ద్వారా ఓపాప కూడా జన్మించింది. ప్రియాంక తన గారాలపట్టికి మాల్తీ మేరీ అని పేరు పెట్టింది. తాజాగా కూతురు, భర్తతో కలిసి తొలిసారిగా ఇండియాకు ప్రియాంక చోప్రా వచ్చారు. నిక్ జోనాస్, ప్రియాంక కుమార్తె మాల్తీ మేరీ శుక్రవారం ముంబై విమానాశ్రయంలో కనిపించారు.
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ గ్రాండ్ ఓపెనింగ్ కోసం వారు ముంబయికి వచ్చినట్లు సమాచారం. కాగా.. తన కూతురు మాల్తీని భారత్‌కు తీసుకురావడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గతంలో కొన్ని ఫోటోలు షేర్ చేసినా పాప మాల్తీ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతుండేది. ఇటీవలే జొనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్లో ప్రియాంక తన గారాలపట్టి మాల్తీ ముఖాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.