మచిలీపట్నం సెప్టెంబర్ 16. ఆంధ్రపత్రిక.
ప్రాథమిక స్థాయి విద్యార్థుల భవిత ప్రశ్నార్ధకం కాకుండా చూడాలని , 3, 4 ,5 తరగతులను అస్తవ్యస్తంగా మెర్జి చేయడం ఎంతవరకు సమంజసం అని సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు కావాలని జిల్లా ఉన్నతాధికారులను రాజనాల భాస్కరరావు ఆగస్టు 28న కోరడం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఏ విధమైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నెల లోపు తన సమస్య పరిష్కారం కాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. కోడూరు, నాగాయలంక మండలాల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 117 జీవోని, తుంగలో తొక్కి కొంతమంది మండల విద్యాశాఖ అధికారులు ఆడుతున్న వింత నాటకాలకు తెరదించాలని విజ్ఞప్తి చేశారు. 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం రాజనాల భాస్కరరావు కృష్ణాజిల్లా డీఈవో ని వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు. కోడూరు,నాగాయలంక విద్యాశాఖ అధికారి ప్రభుత్వ విధానాలకు తూట్లు పొడుస్తూ గండి కొట్టేలాగా స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని రాజనాల భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశారు. జి.ఓ.నెంబర్ 117 ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న మూడు, నాలుగు, ఐదు, తరగతులను ఉన్నత పాఠశాలలో మెర్జ్ చేయాలని చెబుతోందన్నారు. కానీ కోడూరు, నాగాయలంక మండలాల్లో అస్తవ్యస్తంగా జరగడం, జీ . ఓ. ప్రకారం నిబంధనలు పాటించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో ఎంఎస్ నెంబర్ 117 ప్రకారము, కోడూరు, నాగాయలంక మండలాల్లో, ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారని అన్నారు. ప్రాథమిక పాఠశాలలు ఒక కిలోమీటర్ లోపు పరిధిలో ఉన్నప్పటికి, 3 ,4 ,5 తరగతులను కొన్ని ఉన్నత పాఠశాలల్లో మెర్జ్ చేసి మరికొన్ని పాఠశాలలను విస్మరించడం, మెర్జ్ చేయకపోవడం, దాట వేటు ధోరణి ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఉదాహరణకు కోడూరు, నాగాయలంక మండలాల్లో మండల విద్యాశాఖ అధికారి కొన్ని పాఠశాలలు ఒక కిలోమీటర్ పరిధిలోపు ఉన్నప్పటికీ తనకు భజన చేసే కొంత మంది ఉపాధ్యాయులకు మేలు చేకూర్చే విధంగా ప్రాథమిక పాఠశాల కిలోమీటర్ పరిధిలోపు ఉన్నప్పటికి సమీప ఉన్నత పాఠశాలలో మెర్జ్ చేయలేదని తెలిపారు. సదరు ప్రాథమిక పాఠశాల కిలోమీటర్ పరిధిలోపు ఉన్నా మెర్జ్ చేయకపోవడం లో గల చిదంబర రహస్యం ఏమిటన్నారు.అని ప్రశ్నించారు. ఈ విషయంపై మరింత లోతుగా వివరాలు తెలుసుకోవడానికి కృష్ణాజిల్లా డిఇఓ ను సమాచార హక్కు చట్టం ద్వారా ఆగష్టు 28 న కోరడం జరిగిందని రాజనాల భాస్కరరావు తెలిపారు. సంబంధిత ఎంఈఓ లకి డిఇఓ సమగ్ర సమాచారం ఇవ్వవలసిందిగా కోరారని ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ, మండల స్థాయిలో అధికారులు నిర్లిప్తంగా , నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగునా? అని ప్రశ్నించారు. తనకు ఇప్పటివరకు 20 రోజులు గడిచినా తనకు ఏ విధమైన సమాచారం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోడూరు మండలం, వి. కొత్తపాలెం ఉన్నత పాఠశాలలో ఏడు గదులతో వసతి ఉన్నప్పటికీ, ఎంఈఓ కి సంబంధించిన ఒక ఉపాధ్యాయునికి మేలు చేకూర్చడం కోసం అర కిలోమీటర్ లోపు ఉన్న పాఠశాలని వి. కొత్తపాలెంలో ఎందుకు మెర్జ్ చేయలేదు, అని అన్నారు. కోడూరు మండలం లింగారెడ్డి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరు తరగతి గదులే ఉన్నప్పటికీ అక్కడి ప్రాథమిక పాఠశాలను నిబంధనలకు అనుకూలంగా మెర్జ్ చేశారు. దీనిని బట్టి అయినవారికి ఆకుల్లోనా? కాని వారికి కంచాల్లోనా? అని భాస్కర రావు ఆరోపించారు. నాగాయలంక మండలం ఏటి మొగ ఉన్నత పాఠశాలలో 7 తరగతి గదులు ఉన్నప్పటికీ దానిలో 3, 4, 5 తరగతులను పక్కనున్న ప్రాథమిక పాఠశాల నుండి మెర్జ్ చేశారు. విద్యా బోధన కూడా జరిగింది. అక్కడ పిల్లలకు గత ఆరు నెలలుగా మధ్యాహ్న భోజనం పెట్టారని అన్నారు. కాని ఒక యూనియన్ నాయకుడి ప్రలోభాలకు లొంగి ఎల్. ఎఫ్ .ఎల్. హెచ్ ఎం గా పదోన్నతి పొందాక ఉన్నత పాఠశాలలో ఉంటే అతని కో ఆపరేటివ్ అధ్యక్ష పదవి పోతుందని మొర పెట్టుకోవడంతో, ఎంఈఓ ఆ ఉపాధ్యాయుడి పక్షాన నిలిచి పిల్లల్ని తిరిగి పూర్వ ప్రాథమిక పాఠశాలకు పంపించడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. అస్తవ్యస్త విద్యా విధానాల వల్ల జగనన్న ప్రభుత్వం సంకల్పం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల ఉనికిని ,ఖ్యాతిని పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే మండల విద్యాశాఖ అధికారి తీరు వల్ల విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతోందని తీవ్ర స్వరంతో అన్నారు. నాగాయలంక మండలం గణపేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాల మెర్జ్ చేయాలి. జిల్లా శాఖ అధికారులు మెర్జ్ చేయాలని ప్రతిపాదనలు పంపినా ఎంఈఓ లక్ష్యపెట్టకుండా మెర్జ్ చేయకుండా, అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఆ ఎంఈఓ కి ఒక ఉపాధ్యాయ సంఘం నాయకుడి ని ఎలా కాపాడుకోవాలో తెలిసినట్టు ఎవరికి తెలీదన్నారు. ఆ ఉపాధ్యాయుని కొమ్ము కాసి కాపాడారు , నన్ను అలాగే కాపాడండి అని మొర పెట్టుకోవడంతో ఆ పాఠశాలను మెర్జ్ చేయకుండా నిబంధనలు తుంగ లో తొక్కారని ఆరోపించారు. ఆ ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో కొనసాగేలాగా చేయడం విడ్డూరం అని అన్నారు. ఈ మెర్జింగుల గందరగోళం విషయాలపై బందరు ఎంఈఓ ని ఉన్నతాధికారులు అబ్జర్వర్ గా నియమించడం కూడా జరిగింది. ఎంతో నిజాయితీపరుడుగా, నిబద్ధత గల అధికారిగా పేరుపొందిన బందరు ఎంఈఓ ఎలాంటి ఒత్తిడిలకు తల ఒగ్గారో అని భాస్కర రావు ఆరోపించారు. కానీ ఎలాంటి విచారణ చేయకుండా పట్టించుకోకుండా, ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలో తొక్కి కోడూరు, నాగాయలంక ఎంఈఓ కి అనుకూలంగా రిపోర్ట్ పంపడం ఎంత వరకు భావ్యం? అని అన్నారు..! అస్తవ్యస్త విద్యాపాలనా విధానాల వల్ల విద్యార్థుల భవిత ఏమవుతుందని భాస్కర రావు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లోతుగా విచారణ జరిపి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని , విద్యార్థుల భవితకు, భద్రతను కల్పించాలని రాజనాల భాస్కర రావు కోరారు. సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులంతా బడికి దూరం కాకుండా చూడాలని భాస్కర రావు కోరారు.