నవంబర్ 03 (ఆంధ్రపత్రిక): కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ , టాలీవుడ్ దర్శకుడు అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ’ప్రిన్స్’ ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 21న తెలుగు, తమిళంలో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. అనుదీప్ గత చిత్రం ’జాతిరత్నాలు’ మాదిరే ఈ చిత్రంలోని కామెడీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. రియా ర్యాబోసప్కా హీరోయిన్‌గా నటించిన.. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో సందడి సిద్ధమవుతోంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 25న స్ట్రీమింగ్ చేసేందుకు హాట్‌స్టార్ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీని గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. థేంటంటే..స్వతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన వ్యక్తి విశ్వనాథ్ అతనికి కుల మతాలు అంటే నచ్చదు. అతని కొడుకే ఆనంద్ . ఓ స్కూల్లో టీచర్‌గా పని చేస్తుంటాడు. అదే స్కూల్లో పని చేసే బ్రిటీష్ అమ్మాయి అయిన ఇంగ్లిష్ టీచర్ జెస్సిక (మరియ)ని ప్రేమిస్తాడు. వీరి ప్రేమ జెస్సిక తండ్రికి నచ్చదు. అందుకే వారి మధ్య ప్రేమ రెండు దేశాల మధ్య గొడవగా మారుతుంది. దాని వల్ల ఆనంద్‌కి ఏమేం సమస్యలు వచ్చాయి? వాటి నుంచి బయట పడి ఆనంద్ తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడనేది ఈ చిత్ర కథాంశం.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!