మచిలీపట్నం సెప్టెంబర్ 27 ఆంధ్ర పత్రిక.
మచిలీపట్నం కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రజాదరణలో ముందుకు దూసుకుపోతోంది. తక్కువ వడ్డీ తో రుణాలు ఇవ్వడం, రైతు నేస్తం రుణాలు, కర్షక మిత్ర రుణాలు ఇవ్వటమే గాక చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా అందిస్తోంది. ఇటీవల బ్యాంక్ చైర్మన్ గా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన తాతినేని పద్మావతి అనతి కాలంలోనే బ్యాంక్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. జగనన్న సహకార గృహ హక్కు పథక రుణాలు,సహకార ఫిష్ ఆంధ్ర పథక రుణాలు, సహకార గృహమిత్ర పథక రుణాలు,ఇవ్వటమే గాక వ్యాపారస్తులకు క్యాష్, క్రెడిట్ రుణాలు కూడా అందిస్తోంది. కె.డి. సి. సి. బ్యాంక్ సి.ఈ. ఓ. ఏ.శ్యామ్ మనోహర్ బ్యాంక్ అభివృద్ధికి అవిరళ కృషి చేస్తున్నారు
కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ దేశంలోనే ఉత్తమ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ గా ప్రతిష్టాత్మక ఎన్. ఏ.ఎఫ్.ఎస్. సి. ఓ.బి. అవార్డ్ ని జైపూర్ లోని మారియెట్ హోటల్ లో జరిగిన నాప్స్కాబ్ వార్షిక సమావేశంలో 2020- 21 ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను , ఉత్తమ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అవార్డ్ ను నాప్స్కాబ్ చైర్మన్ కె.రవీంద్ర రావు చేతుల మీదుగా కృష్ణా డిసిసిబి చైర్ పర్సన్ తాతినేని పద్మావతి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ డి సి సి బి డైరెక్టర్ కె రవిశంకర్, జి . రవీంద్ర రాణా, జి పెద వెంకయ్య, టి. కృష్ణారావు, సుజాత, బ్యాంకు సీఈవో ఏ శ్యాం మనోహర్, జి ఎం ఎం.రంగబాబు పాల్గొన్నారు.