చిరుత సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన మెగా పవర్ స్టార్ రాం చరణ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మెగాస్టార్ కొడుకుగానే చత్రసీమకు పరిచయం అయినా రెండో సినిమాతోనే సూపర్ డూపర్ హిట్టు కొడతాడని ఏఎరూ అనుకోలేదు. కానీ చెర్రీ తన రెండో సినిమాతోనే సినీ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు. అందులోనే డైలాగ్ లు పాటలు అంటే అభిమానులకు ఇప్పటికీ ఇష్టమే. రాజమౌళి రామ్ చరణ్ కాంబోలో వచ్చిన మగధీర సినిమా 2009 జులై 31వ తేదీన విడుదలైంది. పదమూడేళ్ల క్రితం సినిమా గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నామా అనే డౌట్ వస్తోందా. ఇందకూ ఓ కారణం ఉందండి. అదేంటంటే.. ఈ సూపర్ డూపర్ హిట్టు సినిమాను రీ రిలీజ్ చేయబోతు న్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 17వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. మరోసారి కాలభైరవ మిత్రవిందల ప్రేమ కథను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా రీరిలీజ్ గురించి తెలిసినప్పటి నుంచి ఫుల్ ఖుషీ చేస్తున్నారు. అయితే అల్లు అరవింద్ నిర్మాణంలో దర్శకధీరుడు రాజమోళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. నటుడు శ్రీహరి కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాకు కథను డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించారు. అలాగే ఎం రత్నం మాటలు రాశారు. ఆల్ టైం హిట్టుగా నిలిచిన పాటలను భువన చంద్ర చంద్రబోస్ కీరవాణిలు సమకూర్చారు. మగధీర సినిమా 13 ఏళ్ల కిందనే 40.42 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. మొత్తంగా రూ.77.96 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా బయ్యర్లకు 37.54 కోట్ల భారీ లాభాలను అందించింది. మరోసారి ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రెండో సారి రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఏ మేర వసూలు చేస్తుంది ఎన్ని థియేటర్లలో విడుదల అవుతుంది వంటి విషయాలు తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!