చిల్లి గార్లిక్ ప్రాన్స్ నూడిల్స్ రెడీ. దీన్ని స్ర్పింగ్ ఆనియన్ గ్రీన్స్ వేసుకుని తినాలి
కావాల్సిన పదార్థాలు:
వెల్లుల్లి- 4 టీస్పూన్ (సన్నగా తరిగినవి), పచ్చిమిరపకాయలు- 2 (సన్నగా తరగాలి), రెడ్ చిల్లీ ఫ్లేక్స్- 2 టీస్పూన్లు, నూనె- 3 టీస్పూన్లు, తరిగిన కొత్తిమీర- 1 స్పూన్, శుభ్రం చేసిన రొయ్యలు- 12, ఎగ్నూడిల్స్- కప్పు (ఉడకబెట్టినవి), ఉప్పు- రుచికి తగినంత, సోయాసాస్- టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్- ఒకటిన్నర టీస్పూన్, బ్లాక్పెప్పర్ పౌడర్- 1 టీస్పూన్, వెనిగర్- టీస్పూన్, స్ర్పింగ్ ఆనియన్ గ్రీన్స్- 2 స్టాక్స్ (తరిగినవి).
తయారీ విధానం:
ఒక కప్పులో ప్రాన్స్ తీసుకుని అందులోకి గార్లిక్తో పాటు మిరపపొడి వేయాలి. ఆ తర్వాత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేయాలి. కాస్త వేడయ్యాక రొయ్యలు వేయాలి. మంట పెంచి బాగా వేగించాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని పక్కనబెట్టుకోవాలి. ఆ తర్వాత మరో ప్యాన్లో నూనె వేసి పచ్చి మిరపకాయలు వేసి వేయిస్తూ మధ్యలో గార్లిక్, కొత్తిమీర వేయాలి. గార్లిక్ బంగారు రంగు వచ్చాక నూడిల్స్ వేయాలి. గరిటెతో తిప్పుతూ సోయాసాస్, రెడ్ చిల్లీసాస్ కొద్దిగా వేయాలి. పెప్పర్ పౌడర్ వేసి మిక్స్ చేస్తుండాలి. దీనికి రొయ్యలు కలపాలి. బాగా గరిటెతో కలియ బెడుతుండాలి. ఆ తర్వాత వెనిగర్ వేయాలి. చిల్లి గార్లిక్ ప్రాన్స్ నూడిల్స్ రెడీ. దీన్ని స్ర్పింగ్ ఆనియన్ గ్రీన్స్ వేసుకుని తినాలి.