- రక్షణశాఖలో ప్రవేశ పెట్టిన మంత్రి రాజ్‌నాథ్
- కొద్ది సేపు హెలికాప్టర్లో విహరించిన రక్షణమంత్రి
- రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో జరిగిన వేడుకలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్ జనరల్ అనిల్
- చౌహాన్, వాయుసేనా ధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరి
- పర్వత ప్రాంతాల్లోనైనా, ఎత్తు, వాతావరణంలోనైనా సామర్ధ్యంతో ప్రయాణించగల ’ప్రచండ్’ హెలికాప్టర్లు
- మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ అనేదే మా నినాదం: రక్షణమంత్రి రాజ్‌నాథ్
న్యూఢల్లీి, అక్టోబర్3 (ఆంధ్రపత్రిక):స్వదేశీ పరిజ్ఞానంతో ’ప్రచండ్’ పేరిట రూపొందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లు సోమవారం లాంఛనంగా భారత వైమానిక దళంలో చేరాయి. అనేక రకాల క్షిపణులు, ఇతర ఆయుధాలను ప్రయోగించగల ఈ లోహ విహంగాల రాకతో మన వాయుసేన సత్తా మరింత ఇనుమడిరచనుంది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో జరిగిన వేడుకలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరి ఈ హెలికాప్టర్లను లాంఛనంగా వాయుసేనలో ప్రవేశపెట్టారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ప్రయాణించారు. రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి పాల్గొన్నారు. అనంతరం జోథ్‌పూర్ ఎయిర్ బేస్ నుంచి ప్రచండ్ హెలికాప్టర్లో కొద్దిసేపు ప్రయాణించారు. ఏరోస్పేస్ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) అభివృద్ధి చేసిన ఈ ఎల్‌సీహెచ్‌లను ప్రధానంగా ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మోహరించేందుకు వీలుగా డిజైన్ చేశారు. దేశీయంగా తయారు చేసిన లైట్ కంబాట్ హెలికాప్టర్ చాలా స్మూత్‌గా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఎలాంటి పర్వత ప్రాంతాల్లోనైనా, ఎత్తు, వాతావరణంలోనైనా ప్రయాణించగలదు. దాడి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ అనేదే మా నినాదం అని హెలికాప్టర్లో ప్రయాణం అనంతరం రాజ్‌నాథ్ విూడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఎల్‌సీహెచ్‌ల ప్రవేశంతో ఐఏఎఫ్ పోరాట పటిమ మరింత పెరిగిందని ఆయన తెలిపారు.