డిసెంబర్ 24 (ఆంధ్రపత్రిక): పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు భారీ క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు. నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో ఇప్పటికే ’ఆది పురుష్’ పూర్తయి వీఎఫ్ ఎక్స్ వర్క్ దశలో వుండటంతో ప్రభాస్ మిగతా మూడు సినిమాలని పూర్తి చేసే పనిలో వున్నాడు. ఇందులో ’కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ’సలార్’ కూడా వుంది. కోల్ మైన్స్ నేపథ్యంలో కేజీఎఫ్ తరహా థీమ్ తో ఈ మూవీని ప్రశాంత్ నీల్ అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని ’కేజీఎఫ్’ మల్టీవర్స్‌లో భాగంగా తెరకెక్కిస్తున్నాడనే వార్తలు గత కొంత కాలంగా వినిపి స్తున్నాయి. అంతే కాకుండా ఈ మూవీని కూడా ’కేజీఎఫ్’ తరహాలో రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతు న్నారని తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వార్త ప్రభాస్ ఫ్యాన్స్‌ని మరింతగా ఆకట్టుకుంటూ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాల్ని క్రియేట్ చేస్తోంది. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ జగపతిబాబు మధు స్వామి ఈశ్వరీ రావు శ్రియారెడ్డి నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ దాదాపుగా 85 శాతం పూర్తయింది. ఈ మూవీ సీక్వెల్ ఫైనైల్ కట్ చూశాకే మేకర్స్ నిర్ణయం తీసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ’కేజీఎఫ్’ మూవీకి ఇదే పంథాని అనుసరించిన మేకర్స్ ’సలార్’ విషయంలోనూ అదే ఫాలో కావాలనుకుంటున్నారట. ఇదే విషయాన్ని ఇటీవల ఓ విూడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ నిర్మాత విజయ్ కిరగందూర్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. రాబోయే ఐదేళ్లలో ఇండియన్ సినీ పరిశ్రమలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నామని ప్రకటించిన విజయ్ కిరగందూర్ పలు సీక్వెల్స్ గురించి ఆలోచిస్తున్నామని ఇందులో తాజా హిట్ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశారు. కానీ ’సలార్’ సీక్వెల్ వుంటుందా? ..ప్రస్తుతం సైమల్ టెనియస్గా సీక్వెల్ షూటింగ్‌ని చేస్తున్నామనే విషయాన్ని మాత్రం వెల్లడిరచలేదు. దీంతో ’సలార్’ సీక్వెల్ ని అభిమానులని సర్ ప్రైజ్ చేస్తూ ప్రకటించే అవకాశం వుందనే వాదన వినిపిస్తోంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!