మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. కంప్లీట్ గా ఓ ప్యాలస్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ మూవీ కథాంశం ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇక ఇప్పటి వరకు ఈ మూవీకి సంబందించిన రెండు షెడ్యూల్స్ చేసినట్లు గా సమాచారం. ఇక గురువారం నుంచి మరో నెక్ట్స్ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొంటాడని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహనన్ కాంబినేషన్ లో సన్నివేశాలని ఈ షెడ్యూల్ లో పూర్తిచేయడానికి దర్శకుడు మారుతి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇక సోషల్ విూడియాలో దీనికి సంబందించిన అప్డేట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం ప్రభాస్ చాలా తక్కువ కాల్స్ షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే దీనికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువగా ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మాళవిక మోహనన్ తో పాటు ఆషికా రంగనాథ్ నిధి అగర్వాల్ కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కూడా మారుతి దెయ్యంతో భయపెట్టి ప్రేక్షకులని నవ్వించే ప్రయత్నం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రభాస్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ రిఫ్రెష్ కోసం ఈ మూవీని ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. దీనికోసం రెమ్యునరేషన్ కూడా ప్రభాస్ తీసుకోలేదని సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన లాభాల్లో వాటా మాత్రం తీసుకోవడానికి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో వంద కోట్లతో ఈ మూవీని కంప్లీట్ చేయాలని నిర్మాత ఎలానింగ్ వేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాదిలో ఆదిపురుష్ సలార్ సినిమాలు రిలీజ్ అవుతాయి. వచ్చే ఏడాది పండగకి ప్రాజెక్ట్ కె రిలీజ్ అవుతుంది. మరో మూడు నెలల తర్వాత సమ్మర్ కానుకగా మారుతి సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!