భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉండే పాపులారిటీ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు చాలా గొప్ప ఫాలోయింగ్ ఉంటుంది. సోషల్ మీడియాలోనూ ప్రధాని నరేంద్ర మోడీ అభిమానులు భారీగానే ఉంటారు.
భారత ప్రధానిగా ప్రపంచం పైనే తన మార్కు వేసిన ప్రధాని నరేంద్ర మోడీని ప్రభాస్ హీరోయిన్ దాటిపోయింది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ మోడీని దాటేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు కారణం అవుతుంది.
ఇన్ స్టాగ్రామ్ లో ప్రభావవంతమైన వ్యక్తుల్లో మోడీ ఒకరు
సోషల్ మీడియాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ప్రధాని నరేంద్ర మోడీ ఒకరైనప్పటికీ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నది కోహ్లీకే. 270 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ తో కోహ్లీ మొదటి స్థానంలో నిలువగా కోహ్లీ తర్వాత ప్రియాంక చోప్రా 91.8 మిలియన్ల ఫాలోవర్స్ తో ఉన్నారు.
ఇన్ స్టాగ్రామ్ లో మూడో స్థానంలోకి శ్రద్ధా కపూర్
ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 91.3 మిలియన్ల ఫాలోవర్స్ తో ఉన్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ లో భారత ప్రధాని మూడవ స్థానంలో ఉన్నారు. ఇక ఈ స్థానాన్ని ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ దక్కించుకుంది .91.5 మిలియన్ల ఫాలోయర్స్ తో శ్రద్ధ కపూర్ ప్రస్తుతం మూడవ స్థానంలో నిలబడింది.
ప్రధాని మోడీ ఫాలోవర్స్ ను దాటేసిన శ్రద్ధా కపూర్
శ్రద్ధా కపూర్ ఫాలోవర్స్ సంఖ్య బాగా పెరిగింది. దీంతో ప్రధాని మోడీని ఆమె అధిగమించినట్టయింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ లో మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ 101.2 మిలియన్ల ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో ఉన్నారు. ఇక శ్రద్ధ కపూర్ విషయానికి వస్తే ప్రస్తుతం హిందీలో శ్రద్ధ కపూర్ నటించిన స్త్రీ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకుంది.
స్త్రీ 2 సక్సెస్ తో శ్రద్ధా కపూర్ కు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్
ఇక టాలీవుడ్ లో ప్రభాస్ సరసన నటించిన ఈ భామ సాహో మూవీలో హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో టాలీవుడ్ ఆమెకు పెద్దగా కలిసి వచ్చినట్టుగా అనిపించలేదు. ఇక తాజాగా శ్రద్ధ కపూర్ చేసిన స్త్రీ 2 ఐదు రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి దూసుకు వెళుతుంది. ఈ క్రమంలోనే శ్రద్ధా కపూర్ కు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ 91.5 మిలియన్లకు చేరుకున్నారు.