మళ్లీ యానిమేషన్ లాగే ఉందంటూ ట్రోల్స్
ఈ ఏడాది దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అతి కొద్ది చిత్రాల్లో ప్రభాస్ హీరోగా నటించిన ’ఆదిపురుష్’ భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కింది. మొదటిసారి అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. బాలీవుడ్ యువ దర్శకుడు డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్ నటించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదల చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది. నిజానికి.. ఈ మూవీని మొదట సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించింది. అందులో భాగంగా.. సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, అలాగే టీజర్‌ని విడుదల చేయగా.. యానిమేటేడ్ మూవీలా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అలాగే.. వానరులు, సైఫ్ లుక్‌పై సైతం సోషల్ విూడియాలో ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా రావణుడిగా సైఫ్ అయితే తాలిబన్లా ఉన్నాడంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన చిత్రబృందం ప్రస్తుతం ఈ చిత్రాన్ని జూన్ 16న విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ మూవీ రిలీజ్ గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానందున విడుదల మరోసారి వాయిదా పడుతుందంటూ రూమర్స్ వినిపించాయి. వాటిని కొట్టిపడేస్తూ.. ఓం రౌత్ ఇటీవలే ఓ ట్వీట్ చేశాడు. అందులో జూన్ 16కి ఫిక్సయిపోండని చెప్పాడు. దాంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. అనంతరం.. శ్రీరామనవమి సందర్భంగా ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తారనే వార్తలు వినిపించాయి. అనుకున్నట్లుగానే ఓం రౌత్ మార్చి 30న ఓ పోస్టర్ని విడుదల చేశాడు. అందులో.. సీత, రాముడు, లక్ష్మణుడు నిలుచుని ఉండగా.. హనుమంతుడు మొక్కుతూ ఉంటాడు. దానికి మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్’ అనే క్యాప్షన్ సైతం రాసుకొచ్చాడు. అది ఇంగ్లిష్, హిందీతో పాటు తెలుగులోనూ రాయ డం విశేషం. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయి తే.. ఎప్పటిలాగే ఈ పోస్టర్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్‌కి అంతగా నచ్చ లేదు. దీంతో ’రూ.500 కోట్లు పెట్టి యానిమేటేడ్ మూవీ తీస్తా రా’.. ’ఇంతకుముందుకి ఇప్పటికీ ఏ మాత్రం ఇంప్రూవ్ మెంట్ లేదు’.. ’ఈ పోస్టర్‌కి ఫిల్టర్ ఉపయోగించినట్లు ఉంది. అంతేకానీ ఆర్ట్ వేసినట్లు లేదు’.. ’ఎందుకు రూ.500 కోట్లు వృథా చేస్తున్నావు ఓం రౌత్’.. ’షరా మామూలే. ఏ మాత్రం మారలేదు’.. ’దీనికంటే చిన్న సినిమా హనుమాన్ వీఎఫ్ఎక్స్ బావున్నాయి’ అంటూ విమర్శలు చేస్తున్నారు
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!