హైదరాబాద్,సెప్టెంబర్24(ఆంధ్రపత్రిక): ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హత్యకు పిపిఎఫ్ నేతలు ప్లాన్ చేశారన్న వార్తలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది జులైలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాట్నా టూర్ టార్గెట్ చేసుకుని పిపిఎఫ్ కుట్రలు పన్నిందని, దీనికోసం ప్రత్యేకంగా కొందరికి శిక్షణ ఇచ్చినట్లు ఎన్ఐఎ అధికారుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందన్న కారణంతో పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కదలికలపై దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టిన దాడులతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు తెలియడంతో ఈ విషయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ ఏడాది జూలై 12వ తేదీన బీహార్ లోని పాట్నా సభలో విధ్వంసం సృష్టించేందుకు భారీగా నిధుల సవిూకరణ కూడా జరిగిందని, పీఎఫ్ఐ బ్యాంకు ఖాతాలకు 120 కోట్ల రూపాయల నిధులు వచ్చిచేరినట్లు ఎన్ఐఎ విచారణలో తేలినట్లు సమాచారం. దేశంలోని వ్యక్తుల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఈసంస్థకు నిధులు వచ్చినట్టు విచారణలో తేలింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మరికొందరు ప్రముఖులపైనా దాడులకు కుట్ర జరిగిందని, దాడులు చేసేందుకు పలువురికి శిక్షణ ఇచ్చినట్లు గుర్తించామని ఎన్ఐఎ వర్గాలు తెలిపాయి. దేశంలో అలజడి సృష్టించేందుకు పిపిఎఫ్ కుట్ర పన్నుతుందన్న సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. పిపిఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి 105 మందిని అరెస్ట్ చేశారు ఎన్ఐఎ దాడుల తర్వాత పీఎఫ్ఐ ఆర్థిక కార్యకలాపాలపై ఈడీ దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాలపై ఈవారంలో జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. పిపిఎఫ్ జాతీయ కార్యదర్శి నస్సరుదీన్ ఎలమారం సహా వంద మందికి పైగా నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసింది. వీరిలో కేరళ నుంచి 22 మందిని, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి చెరో 20 మందిని, తమిళనాడు నుంచి 10 మందిని, అస్సాం నుంచి తొమ్మిది మందిని, ఉత్తరప్రదేశ్ నుంచి ఎనిమిది మందిని అధికారులు అరెస్టు చేశారు. తెలంగాణలోని హైదరాబాద్, ఆంధప్రదేశ్ లోని గుంటూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఎన్ఐఎ దాడులు నిర్వహించి, పలువురిని అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, మనీలాండరింగ్ సహా వివిధ ఆరోపణలతో ఈ అరెస్టులు జరిగాయి. మనీలాండరింగ్ ఆరోపణలతో ఎన్ఐఎ కేసులు నమోదు చేసిన వెంటనే వీటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు దేశంలో ఎన్ఐఎ అధికారుల దాడులను నిరసిస్తూ కేరళలో బంద్ కూడా నిర్వహించారు. కేరళలో పీఎఫ్ఐ నిర్వహించిన బంద్‌లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కేరళలో ఆర్ టీసీ బస్సులు, పలు ప్రైవేట్ వాహనాలు ద్వంసం కావడంతో పాటు అనేక మంది సామాన్య ప్రజలకు తీవ్రగాయాలయ్యాయి. ఎన్ఐఎ అధికారులు అదుపులోకి తీసుకున్న పిపిఎఫ్ నాయకులను విచారిస్తున్న సమయంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు వారు ప్లాన్ చేసినట్లు తేలడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఇంకా దేశంలో ఎటువంటి విధ్వంసాలకు పీఎఫ్ ఐ ప్లాన్ చేసిందనే కోణంలోనూ ఎన్ఐఎ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పీఎఫ్ ఐ నాయకుల విచారణలో ఎన్నో కుట్ర కోణాలు బయట పడినట్లు సమాచారం.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!