మణిరత్నం కలల ప్రాజెక్ట్ ’పొన్నియిన్ సెల్వన్’ లో బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగం ’పొన్నియిన్ సెల్వన్ ఎ’ గతేడాది సెప్టెంబర్ 30న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. దాంతో.. రెండో భాగంపై భారీ క్రేజీ ఏర్పడిరది. ’పొన్నియిన్ సెల్వన్ 2’ ని ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో మూవీ టీజర్‌ని విడుదల చేసింది. అందులో.. ఐశ్వర్య లుక్స్ చూసి సినీ లవర్స్ ఫిదా అయిపోతున్నారు. నటి యాక్టింగ్ సూపర్ ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా.. ఐశ్వర్యలోని నటిని హిందీ చిత్ర పరిశ్రమ సరిగా ఉపయోగించుకోలేకపోయిందని విమర్శలు చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే.. ’ మణిరత్నంలాగా ఐశ్వర్యను బాలీవుడ్ ఉపయోగించుకోలేక పోయింది. ఈ తార నందిని పాత్రలో చాలా క్రూరంగా, అలాగే ప్రసన్నంగా కనిపించింది’ అని ఒకరు.. ’నందిని పాత్ర కోసమే ఐశ్వర్య పుట్టింది. ఆమె తన అందాన్ని అన్నింటికంటే ప్రాణాంతకమైన ఆయుధంగా ఉపయోగించే రాణి. కొన్నాళ్ల క్రితం నేను పీఎస్ పుస్తకాన్ని మొదటిసారి చదివినప్పుడే, ఐశ్వర్యని నేను నందినిగా ఊహించుకున్నాను’ అని మరొకరు రాసుకొచ్చారు. ’పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని కల్కి రాసిన నవల ఆధారంగా మణిరత్నం తెరకెక్కించాడు. ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, కార్తీ, త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్, శోభిత ధూళిపాళ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!