సకాలంలో పూర్తి చేయలేని అసమర్థుడు జగన్
గిరిజనలును నిండా ముంచి ఆనందిస్తున్నాడు
కొయ్యలగూడెం పర్యటనలో చంద్రబాబు విమర్శలు
ఏలూరు,డిసెంబర్ 1 (ఆంధ్రపత్రిక): పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి తీసుకువచ్చారని, పనులకు, చేష్టలకు తేడా ఉందని, ఇప్పుడు పోలవరంను గోదావరిలో కలిపేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. పోలవరాన్ని సకాలంలో పూర్తి చేయలేక విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. జగన్ వచ్చాక పెట్టుబడులన్నీ పారిపోయాయని, అంగట్లో అన్ని ఉన్నా.. నోట్లో మాత్రం శని ఉందంటూ సీఎం జగన్పై సెటైర్లు వేశారు. రెండోరోజు గురువారం ఏలూరు జిల్లాలో పర్యటించారు. కొయ్యలగూడెంలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ గిరిజనులకు ఈ ప్రభుత్వంలో ఒరింగిందేవిూ లేదని, మొన్న వరదల్లో వైసీపీ గిరిజనులను ఏ విధంగా చూసిందో అందరికీ తెలుసని అన్నారు. ‘విూరు వరదల్లో కొట్టుకుపోయారన్నా నవ్వుతూ ఉంటారు.. విూ ఇంట్లో మనిషి చచ్చిపోయాడన్నా.. నవ్వుతూ ఉంటారు.. మనిషి మనస్తత్వం విూరు తెలుసుకోవాలని అన్నారు. సీఎం జగన్ విూటింగ్కు వచ్చిన వారు పారిపోకుండా పోలీసులను కాపలా పెట్టారని ఎద్దేవా చేశారు. తనతో పెట్టుకుంటే గుండు కొట్టించి సున్నం పెట్టి ఊరంతా తిప్పుతానని చంద్రబాబు హెచ్చరించారు. విూరు మందు తాగుతున్నారా?.. విషం తాగుతున్నారా?.. జంగారెడ్డి గూడెంలో 29 మంది చనిపోయిన విషయం అందరికీ తెలుసు.. ఆయనే మద్యం ఫ్యాక్టరీ, ఆయనే మద్యం వ్యాపారి, ఆయన మనుషులే వర్కర్లు.. సాయంత్రం అయితే సంచుల్లో డబ్బులు లెక్కపెట్టుకోవడమే వారి పని అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుని పోలీసులు చితకబాదారని, ఆ వీడియో చూసి జగన్ ఆనందపడ్డారని చంద్రబాబు అన్నారు.