ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు శంకుస్థాపన చేయనున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు రూ.330 కోట్లుఖర్చు చేయనున్నారు. స్టేడియం నిర్మాణ పనులు 2025 నాటికి పూర్తవుతాయి. ఇక్కడ త్రిశూల్ ఆకారంలో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేస్తారు. డ్రమ్ ఆకారంలో మీడియా సెంటర్‌ను నిర్మిస్తారు. చంద్రవంక ఆకారంలో పైకప్పులను నిర్మించనున్నారు. మొత్తం 31.6 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియం నిర్మాణం జరగనుంది. 30 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం ఉంటుంది. సి
ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి చేరుకున్నారు. ఈ రోజు ప్రధానికి చాలా ప్రత్యేకమైన రోజు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ స్టేడియంకు పునాది వేయనున్నారు. ఈ వేడుకకు ప్రధానితో పాటు క్రికెట్ ప్రపంచంలోని పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రధాని పర్యటనకు ముందు ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ప్రతి కూడలిలో భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు.
రిజర్వేషన్ బిల్లు ద్వారా మహిళలకు హక్కులు కల్పించిన తర్వాత ప్రధాని మోడీ కాశీకి వెళ్లడం ఇదే తొలిసారి. అందువల్ల ఈ పర్యటన మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రధాని మోడీ వేలాది మంది మహిళలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అటల్ రెసిడెన్షియల్ స్కూల్‌తో సహా కాశీలో కోట్ల విలువైన నిర్మలతో.. బహుమతులను అందిస్తున్నారు ప్రధాని మోడీ.
అటల్ రెసిడెన్షియల్ స్కూల్లో సౌకర్యాలు ఎలా ఉంటాయంటే
ప్రధానమంత్రి నరేంద్రమోడీ వారణాసికి నేడు రూ.1500 కోట్ల బహుమతి ఇవ్వనున్నారు. ఈరోజు 16 అటల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. పాఠశాలకు రూ.1,115 కోట్లు వెచ్చించే యోచనలో సర్కార్ ఉంది. పాఠశాలల్లో అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఒక్కో పాఠశాలలో 1000 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. క్రీడా మైదానం నిర్మిస్తారు. వినోద సౌకర్యాలు కూడా ఉంటాయి. మినీ ఆడిటోరియంలు నిర్మిస్తామన్నారు. హాస్టల్ ఏర్పాట్లు ఉంటాయి. క్యాంటీన్, సిబ్బంది కోసం రెసిడెన్షియల్ ఫ్లాట్లు కూడా నిర్మించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు.
క్రికెట్ స్టేడియం త్రిశూల్ ఆకారంలో లైట్లు, డమ్రు ఆకారంలో మీడియా సెంటర్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు శంకుస్థాపన చేయనున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు రూ.330 కోట్లుఖర్చు చేయనున్నారు. స్టేడియం నిర్మాణ పనులు 2025 నాటికి పూర్తవుతాయి. ఇక్కడ త్రిశూల్ ఆకారంలో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేస్తారు. డ్రమ్ ఆకారంలో మీడియా సెంటర్‌ను నిర్మిస్తారు. చంద్రవంక ఆకారంలో పైకప్పులను నిర్మించనున్నారు. మొత్తం 31.6 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియం నిర్మాణం జరగనుంది. 30 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం ఉంటుంది. స్టేడియంలో ఏడు పిచ్‌లను ఏర్పాటు చేస్తారు.
వారణాసి చేరుకున్న క్రికెట్ ప్రపంచంలోని దిగ్గజాలు
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్, మదన్ లాల్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సెక్రటరీ జై షా తదితరులు పాల్గొంటారు. కాశీ విశ్వనాథ ఆలయంలో మాజీ క్రికెటర్లు పూజలు చేశారు. వేదికపై ఆటగాళ్లు, బీసీసీఐ అధికారులు అందరూ ఉండనున్నారు.
వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్
రాజతలాబ్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం శంకుస్థాపన
గంజరిలో బహిరంగ సభ అనంతరం సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయాని వెళ్లనున్న ప్రధాని మోడీ.. సంస్కృత విశ్వవిద్యాలయంలో 5000 మంది మహిళలను ఉద్దేశించి సంపూర్ణానంద్ ప్రసంగించనున్నారు
రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్లో అటల్ పాఠశాలను ప్రారంభోత్సవం
16 అటల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించనున్న మోడీ..
అటల్ రెసిడెన్షియల్ స్కూల్లోని కొంతమంది పిల్లలతో వర్చువల్ లో సంబాషించనున్నారు
సాంస్కృతిక ఉత్సవాల విజేతలకు కాశీ ఎంపీ సర్టిఫికెట్లు అందజేస్తారు
‘MP స్పోర్ట్స్ కాంపిటీషన్ కాశీ 2023’ పోర్టల్‌ను కూడా ప్రారంభించనుంది.