రాపిడ్ యాక్షన్‌లా తెలంగాణ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ.. ప్రస్తుతం తిరుమల పర్యటనలో వున్నారు. కాసేపట్లో శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత హైదరాబాద్‌కు చేరుకొని.. బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
రాపిడ్ యాక్షన్‌లా తెలంగాణ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ.. ప్రస్తుతం తిరుమల పర్యటనలో వున్నారు. కాసేపట్లో శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత హైదరాబాద్‌కు చేరుకొని.. బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఏపీ పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి జగన్ , TTD చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి, ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో తిరుపతికి చేరుకున్న ప్రధాని కాన్వాయ్‌పై అభిమానులు గులాబీల వర్షం కురిపించారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వీఐపీ అతిథి గృహాలను NSG టీమ్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మరికాసేపట్లో ప్రధాని మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక 2015, 2017, 2019లో శ్రీవారిని దర్శనం చేసుకున్నారు మోదీ, ఆయన తిరుమలను సందర్శించడం ఇప్పుడు నాలుగోసారి. శ్రీవారి దర్శన అనంతరం తిరుపతి ఉదయం 11 గంటల 40 నిమిషాలకు బేగంపేటకు చేరుకుంటారు ప్రధాని మోదీ.
ఇవాళ ప్రధాని మోదీ మహబూబాబాద్, కరీంనగర్లో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. సాయంత్రం4 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్, కాచిగూడలో రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి ఏడున్నరకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుని ప్రధాని మోదీ బెంగళూరుకు వెళ్తారు.