మీరు పీఎం కిసాన్ సమ్మన్ నిధి స్కీమ్ లబ్ధిదారుగా ఉన్నారా? అయితే మీకో అలర్ట్! మీరు 15వ వాయిదా ప్రకారం నగదు స్వీకరించాలి అంటే ఓ కీలకమైన అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు రూ. 2000 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. అయితే మీరు దీనిని అందుకోడానికి ఈ కీలక అప్ డేట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అది కూడా 2023, అక్టోబర్ 15లోపు మూడు పనులు లబ్ధిదారులు చేయాల్సి ఉంటుంది. వాటిని పూర్తి చేయకపోతే పీఎం కిసాన్ లబ్ధదారులకు ఆ రెండు వేల రూపాయల సాయం వారి అకౌంట్ నకు క్రెడిట్ కాదు. ఆ మూడు పనులు ఏంటి? ఎలా పూర్తి చేయాలి? తెలుసుకుందాం రండి..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులందరికీ ముఖ్యమైన వార్త. భారత ప్రభుత్వం ద్వారా 15వ విడత విడుదల చేసే పని వేగంగా సాగుతోంది. ఇప్పటికే PM కిసాన్ పథకం లబ్దిదారు అయితే.. PM కిసాన్ 15 వాయిదా మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు DBT మోడ్ ద్వారా పంపబడుతుంది. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.6 వేలు, ఈ సొమ్మును ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా అందజేస్తారు. కేంద్రం ఈ పథకం 14వ విడతను జూలై 27, 2023న విడుదల చేసింది. నివేదికల ప్రకారం.. PM కిసాన్ 15వ విడత నవంబర్ 30 లోపు రైతుల ఖాతాలకు బదిలీ చేయబడవచ్చు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
రైతులందరూ భారత ప్రభుత్వం ద్వారా e-KYCని పూర్తి చేయడం తప్పనిసరి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఇ-కెవైసికి చివరి తేదీ 15 అక్టోబర్ 2023. అలా చేయకుంటే రైతుల బ్యాంకు ఖాతాలో 15వ విడతలో రూ.2వేలు జమకావు. కాబట్టి, అర్హులైన రైతులందరూ తమ e-KYCని సకాలంలో పొందేలా చూసుకోవాలి.. తద్వారా వారు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందగలరు. ఆ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..
e-KYCని ఇలా పూర్తి చేయండి..
PM కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ద్వారా e-KYCని పొందవచ్చు. PM కిసాన్ మొబైల్ యాప్ గూగుల్ యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది.
రైతులు CSC (కామన్ సర్వీస్ సెంటర్) ద్వారా బయోమెట్రిక్ ప్రమాణీకరణ ద్వారా e-KYCని పొందవచ్చు. రైతులు వెబ్సైట్ను సందర్శించడం ద్వారా OTP ద్వారా ఇ-కెవైసిని కూడా పొందవచ్చు.
PM కిసాన్ వాయిదా ఎప్పుడు వస్తుంది?
రైతులు 15వ విడతను నవంబర్లో లేదా అంతకు ముందు ఎప్పుడైనా పొందవచ్చు. 15వ విడత విడుదలైన తర్వాత, లబ్ధిదారులు అధికారిక వెబ్సైట్ లో స్థితిని తనిఖీ చేయవచ్చు.