తయారీ: ముందుగా టేబుల్ స్పూన్ పాలను కస్టర్డ్ పొడిలో పోసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక పాత్రలో మిగతా పాలు తీసుకొని అందులో కండెన్స్డ్ మిల్క్ వేసి స్టవ్‌పై పెట్టి మరిగించాలి. కస్టర్ట్ పౌడర్ మిల్క్ మిశ్రమాన్ని వేయాలి. పాలు చిక్కబడ్డాక మంట ఆర్పేసి, చల్లారనివ్వాలి. తరువాత మామిడి పండు ముక్కలు, పిస్తా, దానిమ్మ గింజలు వేసి కలపాలి. పిస్తా మ్యాంగో కస్టర్డ్‌ను చల్లగా ఉన్నప్పుడే టేస్ట్ చేయాలి.