Perni Nani on Chandrababu: చంద్రబాబు అరెస్టు అనంతరం ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు ప్రతిపక్షాలు వైసీపీని టార్గెట్ చేస్తుండగా.. అధికార పక్షం టీడీపీని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 45 ఏళ్లుగా ఎంతో అవినీతికి పాల్పడిన చంద్రబాబు పాపం పండిందని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు.
చంద్రబాబు అరెస్టు అనంతరం ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు ప్రతిపక్షాలు వైసీపీని టార్గెట్ చేస్తుండగా.. అధికార పక్షం టీడీపీని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 45 ఏళ్లుగా ఎంతో అవినీతికి పాల్పడిన చంద్రబాబు పాపం పండిందని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. ఇన్నాళ్లు స్లీపర్ సెల్స్ ద్వారా వ్యవస్థను చంద్రబాబు మ్యానేజ్ చేశారని అన్నారు. ఈ కేసు తీగ మాత్రమేనని, డొంకంతా కదలాల్సి ఉందని, కచ్చితంగా కదులుతుందని అన్నారు. సరైనోడికి చేతికి చంద్రబాబు ఇప్పుడు చిక్కారని తెలిపారు. చంద్రబాబును ఎక్కడా నేరస్థుడిగా సీఐడీ అధికారులు చూడలేదని, ఆయనతో ఎంతో మర్యాదగా వ్యవహరించారని నాని అన్నారు. హెలికాప్టర్లో తీసుకెళ్తామంటే వద్దని కారులో వచ్చింది చంద్రబాబేనని, ప్రతీ దాంట్లో ఆయనరాజకీయం వెదుకుతారని నాని విమర్శించారు. చంద్రబాబు అరెస్టుతో ఇన్నాళ్లకు న్యాయం జరిగిందనే భావన తెలుగు ప్రజల్లో ఏర్పడిందని నాని అన్నారు. కోర్టులో ఎక్కడా చంద్రబాబు తప్పు చేయలేదని, ఆయన న్యాయవాది చెప్పలేదని, టెక్నికల్ పాయింట్స్, కుంటిసాకులతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ కేసు తీగ మాత్రమేనని.. డొంకంతా కదలాల్సి ఉందని.. పెర్ని నాని వ్యాఖ్యానించారు.
తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదు: ఎమ్మెల్యే ద్వారంపూడి
తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదు.. ఇప్పుడు చంద్రబాబు విషయంలోనూ అదే జరుగుతోందన్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్. చంద్రబాబు అవినీతి గురించి అందరికీ తెలుసని.. ఆయనకు సానుభూతి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని ఎమ్మెల్యే ద్వారంపూడి పేర్కొన్నారు.
కక్ష సాధింపు చర్య కాదు..
చంద్రబాబు అరెస్టు, రిమాండ్ రాజకీయ కక్ష సాధింపు చర్య కాదన్నారు వైసీపీ నేత కురసాల కన్నబాబు. సీఎం జగన్, చంద్రబాబును జైలుకు పంపించారన్న టీడీపీ నేతల ఆరోపణల్లో నిజం లేదన్నారాయన. పక్కా ఆధారాలతోనే చంద్రబాబును న్యాయస్థానం జైలుకు పంపిందన్నారు కన్నబాబు.