కేంద్రంలో ఉన్న బిజెపి రామరాజ్యం పేరుతో ఊదర గొడుతూ దేశ ప్రజలకు ఇప్పటికే కర్రుకాల్చి వాతలు పెడుతోంది. గతేడాది ప్రధాని పార్లమెంటులో ప్రసంగం ద్వారా తల్లిని బిడ్డను విడదీశారని ఎపి విభజనపై సానుభూతి ప్రకటించారు.ఇప్పుడేమో ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూల్చిందని వాపోయారు.
మూడేళ్లుగా సిఎం జగన్ మూడు ముక్కలాడుతూ..రాజధానిని విశాఖకు తరలిస్తామన్నా పట్టించుకోలేదు. మూడు రాజధానులు అంటూ వల్లె వేస్తున్నా కేంద్రం చేష్టలుడిగి చూస్తోంది. ఈ క్రమంలో అమరావతే రాజధాని అని రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగన ప్రశ్నకు సమాధానంగా ప్రకటించింది. ఇదంతా తెలుగు రాష్టాల్ల్రో పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నాల ఎత్తుగడగా భావించాలి. క్రమంగా తెలుగు రాష్టాల్ల్రో రాజకీయంగా బలపడేందుకు బిజెపి చేస్తున్న యత్నాలే తప్ప..ఇక్కడి ప్రజల సమస్యలను, హావిూలను నెరవేర్చాలన్న బుద్దితో చేస్తున్న ప్రయత్నాలు కాదు. తెలంగాణ ప్రత్యేక రాష్టార్రగా ఏర్పడ్డా ..బంగారు తెలంగాణ.. కల సాకారం కాలేదు. తెలంగాణ ఏర్పడితే అంతా మంచే జరుగుతుందనుకున్న వారు మోస పోయారు. బలిదానాలు ఇచ్చిన వారి కుటుంబాల అతీగతీ లేదు. ప్రజలకు ఊరట దక్కలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కడంలేదు. ఉపాధి కోసం ఎదురు చూసిన వారి కళ్లు కాయలు కాస్తున్నా యి. తెలంగాణ ఉద్యమ జెండా మోసిన వారంతా దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్నా పట్టించుకునే వారు లేరు. ప్రగతి భవన్ సామాన్యులకు అందుబాటులో లేదు. సిఎం కెసిఆర్‌ను కలవాలనుకుంటే కుదరదు. గతంలో ఉమ్మడి ఎపిలో సిఎంలను కలవాలనుకుంటే ఇంతగా ఇబ్బంది ఉండేది కాదు. జెండాలు మోసిన జర్నలిస్టులు అధోగతి పాలయ్యారు. వారిని పురుగుల కన్నా హీనంగా చూస్తున్నారు. ఏ పని చేసినా ఓట్లు రాబట్టుకునే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తోంది. దానినే బంగారు తెలంగాణ అంటూ ఊదర గొడుతున్నారు. ఇదే అవకాశంగా ఇప్పుడు తెలంగాణలో బిజెపి, కాంగ్రెస్, వైటిపి, బిఎస్పిలు తమ వంతు గా క్షేత్రస్తాయిలో కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. ప్రధానంగా ధరణిపై వస్తున్న ఆరోపణలను సరిదిద్దుకునే ప్రయత్నం చయకుండా ఒకటో అరా తప్పులు జరిగితే..ధరణి మొత్తం బాగాలేదని అంటున్నా రని ఎదురుదాడి చేస్తున్నారు. అసెంబ్లీలో మంత్రులు దీనిపై వివరణ ఇచ్చి తప్పులు ఉంటే సరిదిద్దుకుం టామని చెప్పలేకపోయారు. ఈ దశలో ఇప్పుడు రాజన్న రాజ్యం.. అంటూ షర్మిల ఊడిపడ్డారు. ప్రజలను వంచించడానికి ..దోపిడీకి మరో ఎత్తు వేస్తూ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిలమ్మ హఠాత్తుగా తెలంగాణ గడ్డపై పాదయాత్ర చేస్తూ విమర్శలకు పదను పెట్టారు. ఎపిలో అన్న జగనన్న చేస్తున్న రాజ్యం ఎలా ఉందో ఏనాడూ ఆమె ప్రశ్నించలేదు. అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో ఎప్పూడూ ఆరా తీయలేదు. అక్కడ అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయో కనుక్కోవడంలేదు. ఒక్క అవకాశం అంటూ గద్దె నెక్కిన జగన్ పాలన ఎలా ఉందో ప్రపంచమంతా చూస్తోంది. అవినీతి కేసుల్లో కూరుకు పోయిన ఓ నేత ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ పాదయాత్రలు చేస్తున్న వారిని అడ్డు కుంటున్నారు. ఎవరు రోడ్డెక్కినా పోలీసులు కేసులు పెడుతున్నారు. లోకేశ్ పాదయాత్రను అడుగడుగునా.. అడ్డుకుంటున్నారు. అమరావతి పై కేంద్రం ప్రకటనతో కిమ్మనడం లేదు. వైఎస్ వివేకా హత్య కేసుపైనా పెదవివిప్పడం లేదు. ఈ సమస్యలను నిలదీయాల్సిన షర్మిల తెలంగాణపై పడ్డారు. ఇక్కడ ఆస్తులను కాపాడుకునేందుకు అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నారు. ఇకపోతే ఉమ్మడి ఎపిలో ఉన్న నీటి పంచాయితీలే మరింత ఎక్కువగా మళ్లీ మళ్లీ ఉత్పన్నం అవుతున్నాయి. తెలంగాణలో రాజన్నరాజ్యం అంటూ వచ్చిన షర్మిల ఈ ప్రాంత ప్రజలను ఏ విధంగా ఉద్దరిస్తారో ముందు.. ఎపికి వెళ్లి అక్కడ అమలు చేస్తున్న తీరును పరిశీలించి
ఉంటే బాగుండేది. కానీ అలా జరగడంలేదు. తెలంగాణలో వైఎస్ పేరిట పార్టీ ఏర్పాటు చేసి పాదయాత్ర లతో ఎపిలో పరిపాలనను పక్కదోవ పట్టించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అన్న పాలనగురించి పల్లెత్తు మాట కూడా అనని షర్మిల కెసిఆర్‌పై విరుచుకు పడుతున్నారు. ఎపితో పోలిస్తే తెలంగాణలో వందరెట్లు మెరుగైన పాలన సాగుతోంది. రాజన్నరాజ్యం తెస్తామనడం..మరో దోపిడీకి తెలంగాణ గురి కాబోతున్నదని ప్రజలు గుర్తించాలి. ప్రజల అమాయకత్వాన్ని, అవసరాలను క్యాష్ చేసుకోవడం నేటి రాజకీయంగా మారింది. ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ది లోపించంది.లోటస్ పాండ్‌లో ఆత్మీయ సమ్మేళనం అంటూ జరిపిన రాజకీయ హడావిడి చూస్తుంటే..అర్జంటుగా అమె ఎందుకు ఊడిపడ్డారన్నది అర్థం చేసుకోవాలి. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఆమె రాజకీయ జెండా ఎత్తారో ప్రజలు గమనిం చాలి. విడివడ్డ ప్రత్యేక తెలంగాణలో రాజన్నరాజ్యం ఎలా ఉంటుందన్న ఇంగితం లేకుండా ప్రశ్నించడం.. అనుయాయులు చప్పట్లు కొట్టడం అంతా ఓ డ్రామాగా కనిపించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరవాత కెసిఆర్ గులాబీ పాలన సాగుతున్న చోట రాజన్నరాజ్యం ఎలా వుంటుందన్న ప్రాథమిక ప్రశ్న కూడా ఆమెకు కలగలేదా అన్న అనుమానం మనకు కలుగుతోంది. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రచారం చేసుకున్న షర్మిల ఇప్పుడు ఎవరు ప్రయోగిస్తే ఇక్కడ వచ్చిపడిర దన్నది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. నిజానికి ఎపిలో రాజన్నరాజ్యం నడవాలి. కానీ అక్కడంతా అరాచక రాజ్యం నడుస్తోంది. రాజధాని అన్నది లేకుండా…మూడు రాజధానులు ఉండాలన్న విపరీత ఆలోచనలు చేస్తున్న పాలకులు ఉన్నారు. రాజధాని లేకుండా రాజ్యం చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో షర్మిల ప్రశ్నిం చడం లేదు. పార్టీలు పెట్టు..ప్రజలను కొల్లగొట్టు అన్న రీతిలో రాజకీయాలు సాగుతున్నాయి. ఆమెను బిజెపి వారే రంగంలోకి దింపారని కొందరు అంటున్నారు. అయితే బిజెపి రాజకీయ డ్రామాలు ఆపకపోతే ప్రజలు నమ్మరు మోడీ ఎంతగా చప్పట్లు కొట్టించుకున్నా..క్షేత్రస్థాయి సమస్యలు ప్రజలు గుర్తించకపోరు. ఇది గమనించి పాలకులు తమ విధానాలు మార్చుకోవాలి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!