నూజివీడు :గ్రామపంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల కు (గ్రీన్ అంబాసిడర్స్) లేక స్వచ్ఛభారత్ కార్మికులు పెండింగ్ లో ఉన్న జీతాలు విడుదల చేయాలని ఏఐటీయూసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని వెంకట రామారావు డిమాండ్ చేశారు.రాష్ట్రంలో గ్రామీణ పంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు పెండింగ్లో ఉన్న 12 నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇన్చార్జి ట్రైన్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటియుసి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 6 80 ప్రకారం వీరికి పదివేల రూపాయలు జీతం ఇవ్వాలి. వీరికి రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతాలు ప్రతినెల విడుదల చేయాలి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా వీరిని వెంటనే గుర్తించాలి. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి, సమాన పనికి సమాన వేతనం కింద 18 వేల రూపాయలు ఇవ్వాలి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి,, వీరికి ప్రతి రెండు నెలలకు ఒకసారి షూస్ బ్లౌజెస్ శుభ్రం చేసుకోవడానికి కొబ్బరి నూనె , మాస్క్ ఇవ్వాలి వీరి మీద రాజకీయ వేధింపులు ఆపాలి. ,,, ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కన్వీనర్ బత్తుల వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ నూజివీడు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి చాట్ల పుల్లారావు, పారిశుద్ధ్య కార్మికులు. బి శ్రీను ,శేఖర్ యోబు యోహాను ,రవికుమార్ ,ఏసుబాబు, రాధాకృష్ణ ,శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నూజివీడు మండలం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందియూనియన్ గౌరవ అధ్యక్షులుగా చాట్ల పుల్లారావు, అధ్యక్షులుగా బి శ్రీను, కార్యదర్సి కే శేఖర్ వైస్ ప్రెసిడెంట్ గా టీ ఏసుబాబు, యోహాను, సహాయ కార్యదర్శులుగా యోబు, ఈ సర్వేశ్వరరావు, సిహెచ్ శ్రీను ఏడుకొండలు రాము ఎం రాంబాబు పి తిరుపతయ్య జి రవి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!