నవంబర్ 12 (ఆంధ్రపత్రిక): గ్లామర్ రోల్స్‌తో ఆకట్టుకునే పాయల్ రాజ్‌పుత్.. త్వరలో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆమె లీడ్ రోల్‌లో రమేష్ రాపార్తి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ’మాయా పేటిక’. విరాజ్, రజత్ రాఘవ, సిమత్ర్ కౌర్, హిమజ, శ్రీనివాస రెడ్డి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలు. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌ను లాంచ్ చేశారు. ’సెల్‌ఫోన్ వచ్చాక మనుషులు మారిపోయారు. ఏం చేసినా, చూసినా, దాచినా, దోచినా అన్ని ఫోన్‌లోనే. అలాంటి ఫోన్‌కే ఒక కథ ఉంటే..’ అంటూ రానా వాయిస్ ఓవర్‌తో వచ్చిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌విూట్‌లో పాయల్ మాట్లాడుతూ ’ఎంతో రీసెర్చ్ చేసి ఈ మూవీ తీశారు. ఇలాంటి క్యారెక్టర్స్ కూడా అరుదుగా వస్తుంటాయి. డైరెక్టర్ రమేష్ గారితో మళ్లీ పని చేయాలని ఉంది. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చు’ అని చెప్పింది. ’సెల్ ఫోన్ ఆధారంగా ఈ స్క్రిప్ట్ రూపొందించాం. విూ సెల్ ఫోన్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయో అలాంటి ఫుల్ ప్యాకేజీ సినిమా ఇది’ అని చెప్పాడు దర్శకుడు. ’థ్యాంక్ యూ బ్రదర్’ మూవీ తర్వాత ప్రేక్షకులిచ్చిన ధైర్యంతోనే ఈ రెండో సినిమా ’మాయా పేటిక’ను నిర్మించాను అన్నారు నిర్మాత శరత్. అనసూయ, సునీల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!