డిసెంబర్ 29 (ఆంధ్రపత్రిక): పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్‌లో ’హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఓ యాక్షన్ సీక్వెన్స్‌ని పూర్తి చేశారు. ఇది పూర్తి స్థాయి ప్యాన్ ఇండియా సినిమా అని, సౌత్ ప్రేక్షకులకు ఎంతగా నచ్చుతుందో నార్త్ ఇండియన్స్‌కూ అంతే నచ్చుతుందని నిర్మాత ఏ.ఎం.రత్నం చెబుతున్నారు. ఇది పూర్తయ్యాక పవన్ షూటింగ్ స్టార్ట్ చేయబోయే నెక్ట్స్ మూవీ ఏమిటనే విషయంపై ఆసక్తి నెలకొంది. మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి ’వినోదయ సిత్తం’ రీమేక్‌లో పవన్ నటించాల్సి ఉంది. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కాల్సిన చిత్రం ఎప్పటినుండో అభిమానులను ఊరిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఈ మూవీకి ’ఉస్తాద్ భగత్‌సింగ్’ అనే టైటిల్ ్గªనైల్ చేయడంతో పాటు ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. మరోవైపు ’సాహో’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్‌లోనూ ఓ సినిమాను అనౌన్స్ చేశారు. ’ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత డీవీవీ దానయ్య నిర్మించబోతున్న సినిమా ఇది. ఈ మూడిరటిలో ఏది ముందుగా సెట్స్‌కు వెళుతుందనేదే అసలు ప్రశ్న. అయితే ’వినోదయ సిత్తం’ రీమేక్‌ను ముందుగా స్టార్ట్ చేయబోతున్నట్టు టాక్. మిగతా రెండిరటితో పోల్చితే బ్జడెట్‌తో పాటు పవన్ క్యారెక్టర్ డ్యురేషన్ కూడా తక్కువ కనుక దీన్నే ముందుగా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరిలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!