* నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇంజేటి దానం
మొగల్తూరు జూలై 11( ఆంధ్ర పత్రిక గోపరాజు సూర్య నారాయణరావు) జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను వాలంటీర్లు వైకాపా ప్రజాప్రతినిధులు ప్రోత్సాహంతో నరసాపురం అంబేద్కర్ సెంటర్లో దగ్ధం చేయడం పట్ల నరసాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇంజేటి దానం మంగళవారం మొగల్తూరులో ఖండించారు. మొగల్తూరు నెంబర్ వన్ పాఠశాల యందు గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లను తప్పుగా వాడుకుంటున్న వైసీపీ మీద పవన్ కళ్యాణ్ పోరాటమే తప్ప చదువుకుని వేరే దారి లేక పనిచేస్తున్న వాలంటీర్ల మీద కాదని ఆయన గుర్తు చేశారు. నరసాపురం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రాజకీయంగా ఎన్ని కుయత్తులు వేసినప్పటికీ నరసాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ కి చెందిన అభ్యర్థి ఘన విజయం సాధించడం, రాష్ట్రంలో జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని దానం అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ వ్యవస్థాపకుడు మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థ పై మాట్లాడుతున్నప్పుడు వ్యవస్థలో కొందరు గురించి తప్ప వాలంటీర్లు వ్యవస్థ పై కించి పరిచయ విధముగా మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు. సచివాలయంలో వాలంటీర్లు పనితీరు పట్ల ఆయన సంతృప్తి భావంతో ఉన్నారని సచివాలయం వాలంటీర్లు పనితీరులో కొంతమందిని ఉద్దేశించి మాత్రమే ఒంటరి మహిళలు, నిరుపేద అనాధ మహిళలు అంటూ వ్యవస్థలో మాట్లాడేరే తప్ప సచివాలయ వాలంటీర్లు వ్యవస్థపై విమర్శించలేదని ఆయన గుర్తు చేశారు. ఏలూరులో పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర సభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహముపై జనసేన అభిమానులు నిలబడటం పట్ల వైకాపా అభిమానులు తప్పు పట్టడం సబాబు కాదని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ కు ప్రజలలో పెరుగుతున్న ప్రజా ఆదరణ చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసూయ భావంతో తప్పుగా వ్యాఖ్యానించడం జరుగు తోందని దానం ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వారాహయాత్ర విజయవంతముగా జరుగుతున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అంబేద్కర్ ను పవన్ అభిమానులు అవమానపరిచారని పేర్కొనడం పట్ల ఆయన ఖండించారు. వారాహయాత్రలో డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు కనిపిస్తున్న ప్రజాదారణపై అధికార పార్టీ వైకాపా నాయకులు ఆరోపణలు చేయడం స బాబు కాదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పుచ్చకాయల సురేష్, పోతినేని నాగరాజు, కొండ శుభకర్, ఇంజెటి శ్యాంబాబు, బి ప్రభాకర్ రావు, రుద్ర కృష్ణారావు, గుడాల మునీంద్ర, చింతపల్లి గణపతి మరియు ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.