ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోతుందని.. పలు చోట్ల హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోతుందని.. పలు చోట్ల హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ నేతలు పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్ వ్యవస్థపై పవన్ దుష్ర్పచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది.
సురేష్ అనే వాలంటీర్ విజయవాడలోని కృష్ణలంక పోలీసులుకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై అసత్యంగా ఆరోపించారని సురేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాజంలో వాలంటీర్లు తలెత్తుకోకుండా పవన్ ఆరోపించారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు పవన్ కల్యాణ్ పై 153, 153ఏ, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.