జనవరి 10 (ఆంధ్రపత్రిక): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలోపవన్ కళ్యాణ్ ఒక బందిపోటు దొంగగా కనిపిస్తారని టాక్. ఇక ఈ సినిమా కథ 17వ శతాబ్దంఔరంగజేబు సామ్రాజ్యం నాటి నేపథ్యంతో వస్తుంది. సినిమాలో పవన్ ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా లుక్స్ యాక్షన్ తో కనిపిస్తారని తెలుస్తుంది. ఇక సినిమాలో పవన్ దొంగగా కోహినూర్ వజ్రాన్ని దొంగిలిస్తారట. ఔరంగజేబు సామ్రాజ్యంలో ఉన్న కోహినూర్ ను పథకం ప్రకారం వీరమల్లు తన సొంతం చేసుకుంటారట. ఈ సీన్స్ సినిమాలో చాలా స్పెషల్‌గా సినిమాకు హైలెట్ గా ఉంటాయని తెలుస్తుంది. క్రిష్ ఈ సినిమాను చాలా ఫోకస్ తో తెరకెక్కిస్తున్నారు. పవన్ కెరీర్ లో డిఫరెంట్ మూవీగా హరి హర వీరమల్లు సినిమా వస్తుందన్నచర్చ సాగుతోంది. సినిమా అంతా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతి అందిస్తుందని అంటున్నారు. ప్రేక్షకులకు కావాల్సిన వినోదంతో పాటుగా 17వ శతాబ్దం నాటి కథను కూడా క్రిష్ ఈ సినిమాతో చెప్పబోతున్నారు. సినిమాలో హీరోయిన్స్‌గా నిధి అగర్వాల్, జాక్వెలిన్ నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్లో నటిస్తుందని తెలుస్తుంది. పవన్ ఈ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడని తెలుస్తుంది. నిర్మాత ఏ.ఎం రత్నం కూడా సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెడుతున్నారు. పవన్ హరి హర వీరమల్లు సినిమా పాన్ ఇండియా మూవీగా వస్తుంది. సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని చెప్పొచ్చు. సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!