జనవరి 10 (ఆంధ్రపత్రిక): కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ’వినరో భాగ్యము విష్ణుకథ’ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియోలకు మంచి స్పందన వస్తోంది. మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు.నా పేరు విష్ణు మా జీవితాలన్నీ ఏడుకొండల చుట్టూ తిరుగుతా ఉంటయి. ఇంకొన్ని రోజుల్లో విూరందరూ చూడబోయేదే నా కథ.. అంటూ కిరణ్ అబ్బవరం చెప్పే సంభాషణలతో మొదలైంది టీజర్. ఈ సినిమా కథేంటో అని రౌడీ గ్యాంగ్ అడుగుతుంటే.. కాన్సెప్ట్‌తో మొదలై.. లవ్వూ కామెడీ మిక్సయి.. రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనుకోవ చ్చంటున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ చిత్రంలో మురళీ శర్మ క్యారెక్టర్ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ అందించేలా సాగనున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో మురళీ శర్మ సామజవరగమన పాటను ఇమిటేట్ చేయబోతున్నాడని టీజర్‌తో చెప్పేశాడు డైరెక్టర్. మొత్తానికి టీజర్‌తోనే అందరి అటెన్షన్ ను తనవైపుకు తిప్పుకుంటున్నాడు డైరెక్టర్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల వైకుంఠపురంలో మూవీ లవర్స్‌కు మా టీం ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది అంటూ కిరణ్ అబ్బవరం ఇప్పటికే షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో ట్రెండిరగ్ అవుతోంది. ఆ సర్ప్రైజ్ ఇదేనని టీజర్‌తో క్లారిటీ వచ్చేసింది. వినరో భాగ్యము విష్ణుకథ ఫిబ్రవరి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో కశ్మీర పరదేశి హీరో యిన్‌గా నటిస్తోంది. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని బన్నీవాసు నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బురూ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!