ఆర్థికంగా దెబ్బతీసాయన్న దిల్‌రాజ్
డిసెంబర్ 29 (ఆంధ్రపత్రిక): పవన్‌కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ’అజ్ఞాతవాసి’తో చాలా నష్టపోయానని, ఇన్నేళ్ల కెరీర్లో బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డ్యామేజ్ అదే అని దిల్ రాజు చెప్పారు. తాజాగా ఆయన నిర్మించిన ద్విభాషా చిత్రం ’వారిసు’. తమిళ హీరో విజయ్, రష్మిక మందన్నా జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ’వారసుడు’ టైటిల్‌తో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2017లో వచ్చిన ’అజ్ఞాతవాసి’ చిత్రాన్ని నైజాంకు డిస్టిబ్యూట్రర్గా వ్యవహరించాను. అదే ఏడాది మహేశ్‌తో తీసిన స్పైడర్’ సినిమాను కూడా డిస్టిబ్యూట్ర్ చేశా. రెండూ ఆడలేదు. రెండూ ఒకే సమయంలో బిగ్గెస్ట్ ప్లాప్స్ కావడంతో చాలా నష్టపోయా. అయినా తట్టుకుని నిలబడ్డాను. ఇదే పరిస్థితి మరో నిర్మాతకు ఎదురైతే ఆత్మహత్య చేసుకునేవారు. లేదా ఇండస్ట్రీ నుంచి పారిపోయేవారు. అదే ఏడాదిలో నిర్మాతగా 6హిట్స్ రావడంతో నేను నిలబడగలిగాను అని దిల్ రాజు చెప్పారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.