అక్టోబర్ 6 ఆంధ్రపత్రిక :
ఓ టి ఎస్ పథకం కింద 10 వేలు కడితే జగనన్న మీకు 10 లక్షల విలువైన ఆస్తి రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మలకు కానుకగా అందజేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్ అన్నారు.
జగనన్నను ఆదరించి మీ ఆశీస్సులు అందించండన్నారు.
జోగి రమేష్ బుధవారం పెడన మండలం నందమూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి గ్రామంలో ఇంటింటికి వెళ్లి వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల క్రింద వారు పొందిన లబ్ధి వివరించి, నిరుపేదల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు ప్రేమతో ఎంతో మంచి చేస్తున్న జగనన్నకు మీ ఆశీస్సులు అందించాలని మంత్రి కోరారు.
ఓటిఎస్ పథకం క్రింద లబ్ధిదారులు చిలుకూరి వెంకటలక్ష్మి, బడుగు నాగమణి తదితరులకు మంత్రి రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేశారు. మీరు 10 వేలు కడితే, జగనన్న మీకు 10 లక్షల విలువచేసే ఆస్తి మీ పేరట రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజులు అందజేస్తున్నారని, ఇంటిపై బ్యాంకు రుణాలు పొందవచ్చు, క్రయవిక్రయాలు జరుపుకోవచ్చు, వారసులకు బహుమతిగా ఇవ్వచ్చని, జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని మంత్రి లబ్ధిదారులకు సూచించారు.
అంగన్వాడీ వద్ద లబ్ధిదారు గర్భవతి కట్ట కుమారికి వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్టు అందజేశారు.
నందమూరు గ్రామ సచివాలయ పరిధిలో 541 మందికి ప్రతి నెల ఒకటో తేదీన రు.1.45 కోట్లు రూాపాయలు పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామంలో 269మందికి జగనన్న అమ్మఒడి, 247 మందికి లబ్ధిదారులకు వైయస్సార్ చేయూత, 160 మందికి అమ్మఒడి, 72 గ్రూపులకు వైయస్సార్ ఆసరా, 81 గ్రూపులకు సున్నా వడ్డీ, 58 మందికి విద్యా దీవెన, 43 మందికి వాహన మిత్ర పథకాల కింద లబ్ధి చేకూర్చినట్లు మంత్రితెలిపారు.
గ్రామంలో జాతీయ రహదారి నుంచి డ్రైనేజీ పంట బోధిలోకి వదిలారని సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. పంట బోదే ప్రక్క రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు బొమ్ము బాబురావు తదితరులు మంత్రిని కోరగా, గ్రావెల్ రోడ్డు వేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామంలో అక్కడక్కడ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయించాలని మంత్రిని కోరారు.
ఆర్తమూరులో ఉన్న తమ ఓట్లు నందమూరు గ్రామానికి మార్పించాలని గ్రామస్తుడు గూడవల్లి బైరాగి మంత్రిని కోరగా, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
మంత్రి ప్రతి ఇంటి వద్ద ఆగి వారి యోగ క్షేమాలు తెలుసుకొని, వారికి గత నాలుగేళ్లలో వివిధ పథకాల లబ్ధి వివరించి బుక్ లెట్ అందజేశారు. మనకు వంద రూపాయలు అవసరమైతే ఎవరైనా ఇస్తారా? కానీ జగనన్న మీరు అడగకుండానే అవ్వ తాతలకు ఇంటి వద్దకే పింఛన్లు, మీ పిల్లలకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, మహిళలకు చేయూత, జగనన్న తోడు వంటి ఎన్నో పథకాల క్రింద మీ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారని, ఇవన్నీ ఎవరు ఇస్తున్నారంటూ మంత్రి ప్రశ్నించగా, జగనన్నే వేస్తున్నారని బదులిచ్చారు. మీకు అన్నీ చేస్తున్న జగనన్నను మరచిపోవద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో పెడన ఎంపీపీ రాజులపాటి వాణి అచ్యుతరావు, గ్రామ సర్పంచ్ పరసా నరసింహారావు, పెనుమల్లి సర్పంచ్ రామానాయుడు, ఎంపీటీసీ బొల్లా ఉదయ నాగ కుమారి, స్థానిక నాయకులు మండల అధికారులు పాల్గొన్నారు.