ఢిలీ: పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వారి క్షమాపణలను అంగీకరించబోమని, చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. వారివురు సమర్పించిన ప్రమాణ పత్రాలను జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో తాము ఉదారంగా వ్యవరించలేమంటూ స్పష్టంచేసింది.