గోకవరం, ఫిబ్రవరి 10 (ఆంధ్రపత్రిక) : జనం కోసం జనసేన 429వ రోజు కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర గాజు గ్లాసులతో ఇంటింటికి వెళ్లి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, లక్ష్యాలను వివరిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి గాజు గ్లాసు అందజేసి త్వరలో జరగనున్న ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం కోసం సహకరించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. తాను అధికారంలోకి వస్తే ఈ గ్రామానికి చేయబోయే పనులను వివరించారు. రైతాంగానికి ప్రధానంగా పోలవరం భూసేకరణలో అప్పట్లో రైతులకు అన్యాయం జరిగిందని తాము రైతులకు నష్టపరిహారం అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. తాగునీటి సమస్య పరిష్కరిస్తామని, గ్రామస్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించడంతోపాటు గ్రామంలో మౌలిక వసతులు సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో గ్రామ జనసేన నాయకులు ఈలి దొరబాబు, బొద్దపు చందర్రావు, నల్లల తాతబ్బాయి, లక్ష్మీ నాగు, తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!