Women’s Reservation Bill: కొత్త పార్లమెంట్లో అడుగుపెట్టిన వేళ లోక్సభలో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నారీశక్తి వందన్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ప్రస్తుతం లోక్సభలో 82 మంది మహిళా ఎంపీలు ఉన్నారని , రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తరువాత ఆ సంఖ్య 181కి పెరుగుతుందన్నారు.
కొత్త పార్లమెంట్లో అడుగుపెట్టిన వేళ లోక్సభలో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నారీశక్తి వందన్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ప్రస్తుతం లోక్సభలో 82 మంది మహిళా ఎంపీలు ఉన్నారని , రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తరువాత ఆ సంఖ్య 181కి పెరుగుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన తరువాత లోక్సభ ఇవ్వాల్టికి వాయిదా పడింది. బుధవారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ తరువాత బిల్లును ఆమోదిస్తారు. ఏడుగంటల పాటు బిల్లు చర్చ జరుగుతుంది. ఈ బిల్లునకు ఏకగ్రీవ ఆమోదం తెలపాలని కోరుతున్న కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ఇవాళ లోక్సభలో జరగనున్నమహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ తరఫున బిల్లుపై మాట్లాడనున్న సోనియా గాంధీ మాట్లాడనున్నారు. ఓబీసీ కోటా సహా పలు అంశాలపై విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10గంటలకు మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి నేతలు భేటీకానున్నారు. బిల్లుపై ఎలా వ్యవహరించాలనే దానిపై విపక్ష పార్టీలు నిర్ణయానికి రానున్నబిల్లుకు నారీశక్తి వందన్ అధినియమ్ అని పేరు
మహిళా సాధికారికతకు తాము కట్టుబడి ఉన్నామని , అందుకే ఈ బిల్లును తీసుకొచ్చామన్నారు ప్రధాని మోదీ. ఈ బిల్లుకు నారీశక్తి వందన్ అధినియమ్ అని పేరు పెట్టినట్టు చెప్పారు. ఉభయసభలో ఈ బిల్లును ఏకగ్రీవంతో ఆమోదించాలని పిలుపునిచ్చారు. ఎన్నో ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి ప్రయత్నించాయన్నారు మోదీ. కాని దైవమే తనను ఈ బిల్లును అమలు చేసేందుకు పంపిందన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో రచ్చ జరిగింది. 2010 లోనే రాజ్యసభ బిల్లును ఆమోదించిందని , కాంగ్రెస్కు బిల్లుపై క్రెడిట్ ఇవ్వడం ప్రధాని మోదీకి ఇష్టం లేదన్నారు కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే . బీజేపీని టార్గెట్ చేస్తూ సభలో ప్రసంగించారు ఖర్గే. దీంతో బీజేపీ సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుతగలడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ, ఎస్సీ ,ఎస్టీ వర్గాలకు కోటా ఉండాలన్నారు ఖర్గే. అన్ని రాజకీయ పార్టీలు కూడా బలహీనమైన , నిరక్షరాస్యులైన మహిళలకు టిక్కెట్లు ఇస్తున్నారని ఖర్గే వ్యాఖ్యానించడంతో బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖర్గే వ్యాఖ్యలకు గట్టి కౌంటరిచ్చారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ , మహిళలను ఖర్గే కించపర్చారని మండిపడ్డారు. బీజేపీ ఆదివాసీమహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిందన్నారు. తన లాంటి మహిళలకు ఉన్నత గౌరవాన్ని ఇచ్చిందన్నారు.
ఓబీసీ , ఎస్సీ, ఎస్టీ కోటా..
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ , ఎస్సీ ,ఎస్టీ కోటా తప్పకుండా ఉండాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బిల్లులో ఓబీసీ,ముస్లిం మహిళల ప్రస్తావన లేదని, అందుకే వ్యతిరేకిస్తున్నామని తెలిపారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోటా లేకుంటే అర్ధరహితమన్నారు బీజేపీ నేత ఉమాభారతి. ఓబీసీ వర్గానికి కోటా ఇవ్వాలన్నారు. ఈవిషయంపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు చెప్పారు.
అయితే విపక్షాల తీరుపై బీజేపీ మండిపడుతోంది. మరోసారి బిల్లును అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ ఆరోపించింది.