నరసాపురం, మొగల్తూరు జూలై 12 (ఆంధ్ర పత్రిక గోపరాజు సూర్యనారాయణ రావు)
అధికార వైసీపీ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలను వారాహియాత్రలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భాహిరంగంగా భయపెడుతుంటే దానిని డైవర్ట్ చేయడానికి వాలంటీర్లను బలి పశువులు చేసి వాడుకుంటున్న వైసీపీ ప్రభుత్వ చర్యలకు నిరసనగా నరసాపురం బస్ స్టాండ్ సెంటర్లోని అంబేత్కర్ సెంటర్ వద్ద పవన్ కళ్యాణ్ గారి కటౌట్ కు పాలాభిషకం జనసేన పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు నిర్వహించారు. అనంతరం హలో ఎం ఎస్ పి బై బై వైసిపి అంటూ నినాదాలతో మారుమోగించారు అభిమానులు. వైకాపా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అభిమానులు మండిపడ్డారు.ఈ కార్యక్రమానికి నరసాపురం నియోజక వర్గ జనసేన పార్టీ నాయకులు చాగంటి మురళీ కృష్ణ (చిన్నా) పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు, జనసేనపార్టీ కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.