*సిమెంట్ బెంచీలు వితరణ.
*పాదచారుల సౌకర్యార్థం చెరువు గట్టుపై ఏర్పాటు.
వేపాడ,ఫిబ్రవరి,15 ( ఆంధ్ర పత్రిక ):- మండలంలోని వల్లంపూడి గ్రామానికి చెందిన పైడిమాంబ సేవా ట్రస్ట్ సభ్యుల సేవలు ఎల్లలు దాటుతున్నాయని పరువులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా పలువురు దాతలు పైడిమాంబ సేవా ట్రస్ట్ కు అందజేసిన,సిమెంట్ బెంచీలను బాటచారుల సౌకర్యార్థం దబ్బిరాజు చెరువు గట్టు పై 6,మరియు వేపాడ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నందు 2 బెంచీలను ఏర్పాటు చేయడం జరిగిందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.ప్రజలు,దాతలు అందరి ఆదరాభిమానాలతో మరిన్ని సేవా కార్యక్రమాలను చేయుటకు మనందరికి ఆ పైడి తల్లి అమ్మ వారు శక్తి సామర్ద్యాలు ప్రసాదించాలని కొరకుంటూ , బెంచీలను వితరణ చేసిన దాతలందరికి హృదయ పూర్వక ధన్యవాదములు ట్రస్ట్ తరుపున తెలియ జేసుకుంటూ వారికి ఆ పైడి తల్లి అమ్మ వారి ఆశిస్సులు ఎల్ల వేళలా ఉండాలని , కోరుకుంటున్నట్లు ట్రస్ట్ సభ్యులు బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు.ఈ మేరకు వారు మాట్లాడుతూ దాతల వివరాలు తెలియజేశారు ,వల్లంపూడి గ్రామానికి చెందిన తాడి రాంబాబు టీచర్ – 2,శానాపతి గణేష్ -1,శానాపతి సత్యారావు -1, నున్న గొప్పుల వెంకట్రావు -1, చింతల సాయి -1, మంచిన సన్యాసి రావు టీచర్ – 1,సింగిడి బ్రదర్స్ ఒక సిమెంట్ బెంచి చొప్పున మొత్తం 32 వేల ఖర్చుతో తయారుచేసిన ఈ బెంచీలను వితరణగా అందజేశారని ట్రస్ట్ గౌరవ సభ్యులు తాటి రాంబాబు సభ్యులు తెలిపారు.