నవంబర్ 14 (ఆంధ్రపత్రిక): టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు ఈ ఏడాది బాగా కలిసివచ్చింది. గతేడాది ’పాగల్’ వంటి డిజాస్టర్ తర్వాత ఈ ఏడాది ’అశోక వనంలో అర్జున కళ్యాణం’ వంటి బ్లాక్‌బస్టర్‌తో విశ్వక్‌కు మంచి శుభారంభం దక్కింది. అదే జోష్‌తో గతనెల ’ఓరి దేవుడా’ సినిమాను రిలీజ్ చేశాడు. మొదటి రోజు నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను సాధించింది. ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్టయిన ’ఓమై కడువలే’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తూ రీమేక్ సినిమాను కూడా తెరకెక్కించాడు. వెంకటేష్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవలే ఆహాలో రిలీజైంది. ఓరి దేవుడా మూవీ ఓటీటీలోనూ దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రం ’ఆహా’లో అరుదైన ఘనత సాధించింది. కేవలం 40 గంటల్లో 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్‌ను సొంతం చేసుకుని ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన సినిమాగా ఆహాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రోమ్`కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీవిపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. విశ్వక్‌కు జోడీగా మిథిలా పాల్కర్, ఆశా భట్లు ఈ చిత్రంలో నటించారు. పూరి జగన్నాధ్ గెస్ట్ రోల్ పోషించిన ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!