తల్లి శ్రీదేవితో జ్ఞాపకాలను పంచుకున్న జాన్వీ
గత కొంతకాలంగా శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తోంది. అయితే ఆమె పెడుతున్న డిమాండ్స్ కారణంగానే ప్రతీ నిర్మాత జాన్వీని టాలీవుడ్‌కు పరిచయం చేయాలన్న ఆలోచనని విరమించు కుంటూ వస్తున్నారట.అయితే ఫైనల్ గా జాన్వీ కపూర్ టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ ప్రాజెక్ట్ ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా వివిధ కారణాల వల్ల రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి తెరంగేట్రం చేయబోతోంది. అయితే ఈ మూవీలో నటించడానికి జాన్వీ ఏకంగా 5 కోట్లు పారితోషికం డిమాండ్ చేసిందట. అంతే కాకుండా తన వ్యక్తిగత సిబ్బందిని కూడా భరించాలని చెప్పిందట. అయితే మేకర్స్ మాత్రం 4 కోట్లు మాత్రమే ఇస్తామని వ్యక్తిగత సిబ్బందికి అయ్యే ఖర్చుల్ని కూడా భరిస్తామని చెప్పడంతో జాన్వీ కపూర్ ఫైనల్ గా ఎన్టీఆర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే జాన్వీ కపూర్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చలాకీగా, చురుకుగా తన ఫోటోస్ పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది జాన్వీ కపూర్. తన తల్లి శ్రీదేవి 5వ వర్ధంతి ఈ నెల 24వ తేదీన రానుంది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ తన తల్లిని తలుచుకుంటూ భావోద్వేగమయిన మాటలు తన పోస్ట్ చేసింది. అలాగే తాను తన తల్లితో వున్న ఫోటో కూడా షేర్ చేసింది.తన తల్లి గురించి జాన్వీ ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటుంది అని తెలుస్తోంది ఆ మాటలు చూస్తుంటే. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్లినా, నిన్నే తలుచుకుంటా, నీ గురించే వెతుకుతా అని పెట్టింది అంటే, తల్లి గురించి ఎంత ఆలోచిస్తోందో పాపం అనిపిస్తుంది. ’నేను ఇప్పటికీ నీ కోసం ప్రతిచోటా వెతుకుతున్నాను అమ్మా, నేను చేస్తున్న ప్రతి పనీ, నువ్వు గర్వించదగ్గవిగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా నీతోటె మొదలయి, నీతోటె ముగుస్తుంది’, అని పోస్ట్ చేసింది జాన్వీ కపూర్.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!