కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజాభేరి సభకు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ బీఆర్ఎస్-బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రజా తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ను, కేంద్రంలో బీజేపీని ఓడిస్తామన్నారు రాహుల్. తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజాభేరి సభకు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ బీఆర్ఎస్-బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రజా తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ను, కేంద్రంలో బీజేపీని ఓడిస్తామన్నారు రాహుల్. తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మ.2గంటలకు కల్వకుర్తి సభలో పాల్గొంటారు. సా.6 గంటలకు జడ్చర్లలో జరిగే కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు రాహుల్. కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభ తర్వాత ఆయన శంషాబాద్‌లో బస చేశారు. రాహుల్‌తో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు.
అంతకు ముందు కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు నిలిచిపోతుందన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు రాహుల్. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు రాహుల్. ఢిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉన్నా.. ప్రియాంక అనారోగ్యం వల్ల తాను తెలంగాణ పర్యటనకు వచ్చానన్నారు రాహుల్. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదని కుట్ర చేస్తున్నాయని ఆరోపించారాయన. సీఎం కేసీఆర్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరగకపోవడాన్ని ప్రశ్నించారు రాహుల్.
దొరల తెలంగాణ కాదు, ప్రజలు కలగన్న తెలంగాణ సాకారం కాబోతోందన్నారు రాహుల్ గాంధీ. ధరణి పోర్టల్‌తో రైతులకు అన్యాయం జరుగుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని.. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు రాహుల్. ఇందిరమ్మ స్కీమ్ కింద పేదలకు ఇళ్లు.. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు రాహుల్‌గాంధీ. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకటే. ఆ పార్టీలన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయని.. కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదని కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాహుల్ పర్యటనతో కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో మరింత జోష్ వస్తుందని పార్టీ వర్గాలు అంచనావేస్తున్నాయి.