విశాఖపట్నం, డిసెంబర్ 2 (ఆంధ్రపత్రిక):
విశాఖ మహానగరం జగదాంబ జంక్షన్ లో ఆర్ఎస్ బ్రదర్స్ 14వ వస్త్ర షాపింగ్ మాల్ ను,ప్రముఖ టాలివుడ్ నటుడు అక్కినేని వరుణ్ తేజ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా రాష్ట్ర మంత్రి గుడివాడ అమరనాధ్,నగర మేయర్ గోలగాని వెంకట కుమారి, విశాఖ పార్లమెంట్
సభ్యుడు ఎం.వి.వి. సత్యనారాయణ, విశాఖ దక్షిణ నియోజకవర్గశాసనసభ సభ్యుడు వాసుపల్లి గణేశ్ కుమార్ హాజరయ్యారు . దివంగత పి సత్యనారాయణ నెలకొల్పిన ఆర్.ఎస్ బ్రదర్స్తన 14వ షోరూము విశాఖపట్నం, జగదాంబ సెంటర్ లో ప్రారంభించటంఎంతో గర్వంగా ఉందని, సినీ నటుడు వరుణ్ తేజ్ అన్నారు.
ఆర్. ఎస్. బ్రదర్స్ సంస్థతో తన అనుబంధాన్ని వివరించారు. ఒక ప్రత్యేకమైన బ్రాండ్ గా ఆర్.ఎస్ బ్రదర్స్ దినదినాభివృద్ధి చెందటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, విశాఖ వాసుల అభిరుచులనుతగిన నాణ్యమైన వస్త్రాలు ఈ షోరూమ్ లో సరసమైన ధరలలో లభిస్తున్నాయని వరుణ్ తేజ్ వివరించారు.
వివాహాది శుభాకార్యాలతో పాటుగా క్రిస్మస్, సంక్రాంతి వంటి పర్వదినాలకుప్రతి కుటుంబానికి సరిపోయే వెరైటీల కోసం ఆర్ ఎస్ బ్రదర్స్ లో షాపింగ్ చేయమని విశాఖవాసుల్ని ఆయన ప్రత్యేకంగా కోరారు. వస్త్రప్రియులైన
విశాఖ వాసులకు ఆర్. ఎస్. బ్రదర్స్ ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ, ప్రారంభోత్సవ ‘కాస్ట్ టూ కాస్ట్ సేల్స్’ ప్రకటించింది. రానున్న వివాహ.
క్రిన్నస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలకు శుభారంభం పలుకుతూ, అందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు . ఈ సందర్భంగా ఆర్.ఎస్. బ్రదర్స్ రీటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు పి. వెంకటేశ్వర్లు, ఎస్.రాజమౌళి, టి.ప్రసాదరావు, రీజినల్ ఇన్చార్జ్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.