మహానగరంలో మరోసారి వర్షం మొదలైంది. ఇవాళ (మంగళవారం) ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, మాదాపూర్, షేక్ పేట్..
పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఈ వర్ష ప్రభావం హైదరాబాద్ నగరంలో మరో 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
వాతావరణం మేఘావృతమై ఉంటుందని అంచనా వేస్తున్నా అధికారులు. హైదరాబాద్‌లో ఆగస్టు 15 వరకు నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD)హెచ్చరించింది. గురువారం వరకు నగరంలో వర్షాలు కురుస్తాయని, వాతావరణం ప్రధానంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్లో వర్షం పడే సూచనలు ఉన్నాయి.